Site icon NTV Telugu

Simon Doull: పాకిస్థాన్ లో బ్రతకడం కంటే జైలులో జీవించడమే బెటర్

Doll Saiman

Doll Saiman

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ అయిన సైమన్ డౌల్ కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన వ్యాఖ్యనంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. అప్పుడప్పుడు డౌల్ ఆటగాళ్లపై చేసే విమర్శలు వివాదాలకు కారణం అవుతుంటాయి. ఇటీవల ఓ పాకిస్తాన్ ఆటగాడిపై చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలో తాను పాకిస్థాన్ లో ఎదుర్కొన్న మానసిక హింస గురించి డౌల్ తాజాగా బయటపెట్టాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లోని ఓ మ్యాచ్ లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ అజామ్ స్ట్రైక్ రేట్ గురించి దెప్పి డౌల్ సైమన్ దెప్పిపొడిచాడు. క్వెట్టా గ్లాడియర్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో బాబర్ అజాబ్ 65 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అయితే. 83 నుంచి 100 పరుగులకు చేరుకోవడానికి 14 బంతులు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం సాధించింది.

Read Also : Harbhajan Singh : సూర్య, విరాట్, బాబర్ కాదు.. అతనే వరల్డ్ నెం 1 బ్యాటర్..!

బాబర్ అజామ్ ఆడిన తీరుపై కామెంటేటర్ డౌల్ సైమన్ చేసిన వ్యాఖ్యలపై బాబర్ అజామ్ అభిమానుల దగ్గర నుంచి బెదిరింపులు వచ్చాయి. డౌల్ బస చేస్తు్న హోటల్ బయట పెద్ద సంఖ్యలో బాబర్ అభిమానులు ఉండడంతో తాను తినేందుకు కనీసం బయటకు కూడా వెళ్లలేకపోయినట్లు డౌల్ చెప్పాడు. కొద్ది రోజులు తిండి లేకుండా ఇబ్బంది పడ్డానని.. మానసికంగా ఎంతో హింసకు గురైనట్లు వెల్లడించారు. ఎలాగోలా పాకిస్థాన్ నుంచి క్షేమంగా బయట పడినట్లు పేర్కొన్నాడు. తాను పడిన బాధను తెలియజేస్తూ పాకిస్థాన్ లో జీవించడం అంటే జైలు జీవితంతో సమానం అనే వ్యాఖ్యలను సైమన్ చేశాడు.
ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అమీర్ సైహైల్, సైమన్ డౌల్ మధ్య పెద్ద వివాదమే నడిచింది.

Read Also : KGF 2: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున బాక్సాఫీస్ దగ్గర సునామీ పుట్టింది

Exit mobile version