యూరప్ ఖండంలోని సెరిబియా దేశ రాజధాని బెల్గ్రేడ్ లో జరిగిన వరల్డ్ ఓపెన్ వాటర్ ఫిన్ స్విమ్మిం గ్ లో బంగారు పతకం, రజత పతకాలు గెలుచుకున్న భారత స్విమ్మర్ గంధం క్వీన్ విక్టోరియా గురువారం తన సొంత గడ్డ హైదరాబాద్‌కు వచ్చా రు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కోచ్ లు దినేష్ రజోరియ, రాధిక, అభిమానులు పెద్ద ఎత్తున్న ఘన స్వాగతం పలికారు.
Also Read : Health Tips : బచ్చలి కూరను ఎక్కువగా తింటున్నారా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సిందే..
ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల పాల్గొనగా… గోల్డ్ మెడల్, రజత పతకం గెలిచాక క్వీన్ విక్టోరియా.. తొలిసారి హైదరాబాద్ వచ్చారు. అనంతరం విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోచ్ లు… సన్మానించి, అభినందించారు. క్వీన్ విక్టోరియా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తోందన్నారు. అందరి ప్రోత్సాహంతో భవి ష్యత్తులో మరిన్ని విజ యా లు సాధిస్తానని క్వీని విక్టోరి యా ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఓపెన్ వాటర్ ఫిన్ స్వి మ్మింగ్ పోటీల్లో వరుసగా పతకాలు సాధించిన తొలి భారత స్విమ్మర్ గా గంధం క్వీని విక్టోరియా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
Also Read : Nara Lokesh: రాయలసీమ బిడ్డనంటూ క్యానర్ గడ్డలా పీడిస్తున్నాడు..
