Simhachalam Giri Pradakshina 2024: నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. భక్తులకు కీలక సూచనలు
- నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ..
- ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు..
- సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానున్న స్వామివారి రథం..
- ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ..
- పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించు కోవడం భక్తులకు సెంటిమెంట్..
- 32 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simhachalam Giri Pradakshina 2024: నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు.. ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్షలాదిగా తరలిరానున్నారు భక్తులు.. సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానుంది స్వామివారి రథం.. ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ చేపట్టి పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించు కోవడం భక్తుల్లో అనవాయితీగా వస్తుంది.. ఇక, 32 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు చేసింది జిల్లా యంత్రాంగం. ఐదుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు 2,600 మంది పోలీసు సిబ్బంది..
Read Also: UP News: నేడు యూపీలో ‘పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ‘..36.50కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం
Also Read
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
మరోవైపు.. గిరిప్రదక్షిణ కారణంగా ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. వివిధ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని.. భక్తులు, ప్రజలు అగమనించాలని సూచించారు అధికారులు.. నగరం మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించినట్టు పేర్కొన్నారు.. అయితే, సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి
పావంచ వద్ద మొదలు పెట్టాల్సి ఉంటుంది.. తొలిపావంచ నుంచి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక పోలీసు క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గేట్, అప్పుఘర్ జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, వెంకోజీపాలెం, హెచ్బీ కాలనీ, కైలాసపురం, మాధవధార, మురళీ నగర్, బుచ్చిరాజు పాలెం, లక్ష్మీ నగర్, ఇందిరా నగర్, ప్రహ్లాదపురం, గోశాల జంక్షన్, లి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేసుకోవాల్సి ఉంటుంది.. మొత్తంగా గిరిప్రదక్షణ 32 కిలో మీటర్ల మేర సాగుతుంది.. కాగా, ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. ఇక, గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ రోజు, రేపు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. జులై 20న ఉదయం గిరి ప్రదక్షిణ ప్రారంభించి, రాత్రికే తిరిగి సింహాచలం చేరుకునే భక్తుల సౌకర్యార్థం.. రాత్రి 10 గంటలకు వరకు దర్శనాలకు అనుమతించనున్నారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?
-
India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!