NTV Telugu Site icon

Simbaa OTT: ఓటీటీలోకి అనసూయ క్రైమ్‌ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Simbaa Ott

Simbaa Ott

Simbaa OTT Release Date: అనసూయ భరద్వాజ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సింబా’. మురళీ మనోహర్‌ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకు డైరెక్టర్‌ సంపత్‌ నంది కథ అందించారు. ఈ సినిమా ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సింబా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో సింబా సినిమా సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డ ఈ సినిమా.. ఓటీటీ ఆడియెన్స్‌ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో, దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే కథాంశంతో రూపొందించారు.

Also Read: The GOAT Review: విజయ్ ‘ది గోట్’ రివ్యూ.. హిట్ కొట్టాడా? లేదా?

సింబా సినిమాలో కస్తూరి శంకర్, దివి వైద్య, శ్రీనాథ్, కబీర్ సింగ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్ సంపత్ నంది, రాజేందర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Show comments