Site icon NTV Telugu

Sardar : ‘సర్దార్’ యూనిట్ కి వెండి వాటర్ బాటిల్స్

Sarda

Sarda

కార్తీ హీరోగా నటించిన ‘సర్దార్’ సినిమా థియేటర్లలో విడుదలై సక్సెస్ సాధించింది. ఇటీవల ఓటీటీలోనూ విడుదల చేయగా చక్కటి స్పందన లభించింది. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ స్పై థ్రిల్లర్‌లో రాశీఖన్నా, లైలా, రజిషా విజయన్ హీరోయిన్స్ గా నటించారు. ఇదిలా ఉంటే ‘సర్దార్’ టీమ్ కి నిర్మాతల నుంచి చక్కటి బహుమతి లభించింది. ఈ చిత్ర నిర్మాతలు ప్రధాన తారాగణంతో పాటు ఇతర సిబ్బందికి 30 వేల విలువైన వెండి వాటర్ బాటిల్స్ ను గిఫ్ట్ గా అందించారు. నిజానికి ఈ సినిమా మెయిన్ థీమ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నివారించడం.

దానికి అనుగుణంగానే నిర్మాతలు కూడా వెండి వాటర్ బాటిల్స్ ను బహుమతిగా అందించారన్నమాట. ఇక ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే దర్శకుడు మిత్రన్ సీక్వెల్‌ని కూడా అధికారికంగా ప్రకటించాడు. కార్తీ ‘ఖైదీ2’ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి సీక్వెల్ కూడా ‘సర్దార్’లాగే వాటర్ బేస్డ్ కాన్సెప్ట్ తో వస్తుందా? లేక కొత్త అంశంతో తెరకెక్కనుందా? అన్నది తెలియాల్సి ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Exit mobile version