Silkworms Cultivation: లాభాలను అందిస్తున్న పట్టుపురుగుల పెంపకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎటువంటి రిస్క్ లేకుండా ఆదాయాన్ని ఇస్తున్న వాటిలో వ్యవసాయం కూడా ఒకటి.. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.. సాంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటి గా మారిందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం పట్టు పరిశ్రమల శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని కొంతమంది రైతులు సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందుతున్నారు..
ఈ పట్టు పురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలను కళ్ల చూస్తున్నారు. తక్కువ పెట్టుబడి కొద్ది సమయంలో అధిక దిగుబడిని సాధిస్తున్నారు. సంప్రదాయ పంటలతో నష్టపోయిన రైతులు పట్టు పురుగుల పెంపకం తో ఆశిస్తున్న దిగుబడులతో లాభాలను అర్జిస్తున్నారు.. ఎక్కువ మంది రైతులు వీటి పెంపకం ద్వారా కళ్లు చెదిరే లాభాలను పొండుతున్నారు.. పట్టు పురుగుల రకాల్లో ఒకటైన మల్బరీ పట్టుపురుగుల పెంపకాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వం రూ. 25,000 మొక్కల పెంపకానికి సబ్సిడీ అందజేస్తుంది. దీంతో రైతులు అనుకూలమైన నేలల్లో వీ1 రకానికి చెందిన మల్బరీ మొక్కలను డ్రీప్ సహయంతో సాగు చేశారు. ప్రభుత్వ సహకారంతో మొక్కలను కొనుగోలు చేసి కూలీల ఖర్చులతో కలిపి పది లక్షల వరకు ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇకపోతే పట్టుపురుగుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ, ఇక రాష్ట్ర ప్రభుత్వం 25శాతం సబ్సిడీ ని ఇస్తుంది..బెడ్స్, ట్రేలను అమర్చారు. బెడ్స్ పై పట్టు పురుగులను ఉంచి వాటికి మల్బరీ ఆకులు వేసి పెంచుతున్నారు. ఈగలు, రెక్కల పురుగులు, పక్షులు లోపలికి వెళ్లకుండా నైలాన్ తెరను ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా పంటను కాపాడుకుంటున్నారు. పట్టు పురుగుల సాగు అతి తక్కువ సమయంలోనే చేతికొస్తుంది. కేవలం 21 రోజుల్లోనే పట్టు పురుగులు పట్టు కాయలుగా మారిపోతాయి. పట్టు పురుగులకు అల్లుకున్న గూళ్లను మార్కెట్లో అమ్ముకోవచ్చు. దీంతో రైతు ఒక నెలలో మంచి దిగుబడి తో పాటు లాభాలను ఆర్జించవచ్చు..మొదటి పంటలోనే 250 కిలోల పట్టు కాయలను విక్రయించి మంచి లాభాలను పొందవచ్చు అంటున్నారు.. ఇక మీకు ఇలాంటి ఆలోచన ఉంటే వ్యవసాయ నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..