NTV Telugu Site icon

IND vs ZIM: రాణించిన సికిందర్ రజా.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

T20

T20

భారత్, జింబాబ్వే మధ్య ఈరోజు నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతుంది. హరారే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మొదట జింబాబ్వే బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. భారత్ ముందు పోరాడే 153 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జింబాబ్వే బ్యాటింగ్లో కెప్టెన్ సికిందర్ రజా (46) రన్స్తో రాణించాడు. 28 బంతుల్లో.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు సాధించాడు. ఆ తర్వాత.. మారుమణి (32), మాధెవెరె (25) పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా పెద్దగా పరుగులు చేయలేకపోయారు. డియోన్ మైయర్స్ (12), బ్రియాన్ బెన్నెట్ (9), క్యాంప్ బెల్ (3), క్లైవ్ మదాండే (7) పరుగులు చేశారు.

Anant Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లి వీడియో వచ్చేసింది.. సందడే.. సందడి

భారత్ బౌలింగ్లో తొలి మ్యాచ్లో అరంగేట్రం చేసిన తుషార్ దేశ్ పాండే మొదటి వికెట్ సంపాదించాడు. ఆ తర్వాత.. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివం దూబే తలో వికెట్ సంపాదించారు. అలాగే.. అభిషేక్ శర్మకు కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలి వికెట్.

Show comments