Sikandar : మురుగదాస్, సల్మాన్ ఖాన్ స్పెషల్ ట్రీట్ వాయిదా.. వచ్చేది అప్పుడే
- సికిందర్ సినిమా టీజర్ రిలీజ్ వాయిదా
- సల్మాన్ పుట్టిన రోజు వస్తుందన్న మేకర్స్
- అనివార్య కారణాల వల్ల రేపు రిలీజ్ చేస్తామని ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sikandar : బాలీవుడ్ స్టార్ మీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ చిత్రం “సికందర్”. మరి ఈ చిత్రంపై భారీ హైప్ నెలకొనగా ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నారు. 2025 ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సికందర్ టీజర్ ను మేకర్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Read Also:Steven Smith Century: టీమిండియా అంటేనే ఊపొస్తుంది.. స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డు!
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
అయితే ఈ సమయంలో మేకర్స్ సాలిడ్ టీజర్ కట్ ని రిలీజ్ చేస్తున్నట్లుగా లేటెస్ట్ గా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మరి ఈరోజే ఆ టీజర్ కూడా రావాల్సి ఉంది కానీ మేకర్స్ దానిని వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. దీనితో ఈ టీజర్ ఈరోజు నుంచి వాయిదా వేసి రేపటికి మళ్లీ అదే సమయానికి విడుదల చేస్తామన్నారు. దీంతో ఈ టీజర్ రేపు అంటే డిసెంబర్ 28న ఉదయం 11 గంటల 7 నిమిషాలకే రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. సో మరొక్క రోజు వరకు సల్మాన్.. సికిందర్ ఎంట్రీ కోసం ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సల్మాన్ స్నేహితుడు సాజిద్ నదియాద్వాల నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈద్ కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
Read Also:Congress: మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే నివాళులు
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటే సికందర్. సికందర్ టీజర్ కు UA 13+ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ బోర్డు ప్రకారం, సికందర్ సినిమా రన్‌టైమ్ 1.45 నిమిషాలని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ టీజర్ లో మాస్క్ అవతార్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. సల్లూ భాయ్ మాస్క్ లు ధరించిన మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి హైపర్ స్టైలిష్ గా కనిపించబోతున్నారు. సమాజంలో అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
తాజావార్తలు
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!