NTV Telugu Site icon

SIKANDAR Teaser: సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు.. సికందర్‌ చిత్ర బృందం స్పెషల్ గిఫ్ట్

Sikandar

Sikandar

సల్మాన్‌ఖాన్‌ సికందర్‌ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. నిన్న సల్మాన్‌ ఖాన్‌ పుట్టినరోజు (డిసెంబర్‌ 27) సందర్భంగా తాజాగా ఈసినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దాదాపు ఒకటిన్నర నిమిషాల టీజర్‌లో తుపాకులు, మాస్క్‌లలో దాగి ఉన్న శత్రువులు కనిపిస్తున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్ లో అద్భుతమైన మ్యూజిక్ ప్లే అవుతోంది. తనపై దాడి చేయడానికి వచ్చిన వారితో సల్మాన్ ఖాన్ ఫైట్‌ చేస్తూ కనిపించాడు. టీజర్ విడుదలైన వెంటనే సికందర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. సికందర్ టీజర్‌లో సల్మాన్ ఖాన్ చెప్పిన అద్భుతమైన డైలాగ్ అభిమానులకు గుర్తుండిపోతుంది.

READ MORE: Grimes: ‘‘నా సవతి తండ్రి ఓ భారతీయుడు’’.. ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలు..

మీర్‌ఖాన్‌తో గజినీ చిత్రాన్ని రూపొందించిన ఏఆర్‌ మురుగదాస్‌ సల్మాన్‌ఖాన్‌ సికందర్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నతో పాటు పలువురు ఇతర నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కథ గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇది యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. సల్మాన్ సన్నిహితుడు సాజిద్ నడియాద్వాలా దీనిని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఇద్దరూ కిక్‌లో కలిసి పనిచేశారు. వచ్చే ఏడాది రంజాన్‌ రోజున సికిందర్ విడుదల చేయనున్నట్లు టీం ప్రకటించింది.

READ MORE: Pushpa 2: పుష్ఫ 2 సినిమాలో ఓ ఊపు ఊపిన పాట.. ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేదోచ్..

Show comments