NTV Telugu Site icon

Sierra Leone: మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారీ.. అత్యవసర పరిస్థితిని విధించిందిన ప్రభుత్వం..!

8

8

ఈ మధ్యకాలంలో అనేక మంది యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా అనేక దేశాల్లో యువత పెడదారు పడుతున్నారు. ఇకపోతే తాజాగా పశ్చిమ ఆఫ్రికా దేశమైనా సియెర్రా లియెన్‌ లో కొన్ని రకాల మత్తు పదార్థాలు బీభస్తాన్ని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆ దేశం పూర్తిగా మాదకద్రవ్యాల సమస్యలతో సతమతమవుతోంది. దేశంలో పరిస్థితి చేయిదాటడంతో ఆ దేశ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. దేశంలోని యువకులు ఒక రకమైన మతపదార్థాన్ని తీసుకోవడం ద్వారా వారు దేశంలోని వీధుల్లో ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. ఈ సంఘటనలతో ఆ దేశ అధ్యక్షుడు జులియస్‌ బయో ఇటీవల దేశంలో ఎమర్జెన్సీని విధించాడు.

Also Read: AP Heat Wave: ఏపీకి అలర్ట్.. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు

ఆ దేశం ఎదుర్కొనే అతిపెద్ద సమస్యని ‘కుష్’ అనే డ్రగ్స్. ఈ రకమైన కొత్త డ్రగ్ ను సేవించి అక్కడ జనం పూర్తిగా మత్తులో ఊగిపోతున్నారు. ఈ రకమైన డ్రగ్ ఆరు సంవత్సరాల క్రితం ఆ దేశంలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఉపాధి అవకాశాలు తక్కువ కావడంతో.. ఆ దేశ యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇకపోతే ‘కుష్’ అనే మత్తుమందు మనుషుల ఎముకలతో తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ డ్రగ్స్ ను తయారు చేసేందుకు మనుషులు ఎముకలను వాడుతున్నట్లు అక్కడి కథనాలు పేర్కొంటున్నాయి.

Also Read: IPL 2024: రమణదీప్ సింగ్ ‘స్టన్నింగ్ క్యాచ్’.. షారూక్ ఖాన్ చప్పట్లతో ప్రశంసలు

ఈ డ్రగ్స్ కు భారీగా డిమాండ్ ఉండడంతో ఆ దేశంలో కొందరు స్మశానాల వెంటపడుతూ.. దొంగలకు డబ్బులు ఇచ్చి మరి సమాధులను తవ్వుతూ దేశ ప్రజల అస్తిపంజరలను ఎత్తుకెళ్తున్నారు. అస్తిపంజరల ఎముకలను స్వాహా చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో స్మశానాల నుండి వందలాది సమాధులను తవ్వినట్లు అక్కడ పోలీసులు తెలిపారు. దీంతో స్మశానాల వద్ద అక్కడి ప్రభుత్వం పటిష్ట నిగానను ఏర్పాటు చేసింది. కుష్ అనే డ్రగ్ వల్ల తమ దేశ అస్తిత్వానికి మనుగడ ఏర్పడిందని.. ఆ దేశ అధ్యక్షుడు స్వయంగా ఈ విషయాన్ని తెలుపుతూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీసుకుంటున్న వారి మరణాల సంఖ్య రోజుకు మరింతగా పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులోంచి ప్రజలను బయటకు తీసుకురావడానికి దేశంలోని ప్రతి జిల్లాలో డీ- అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వీటిని తీసుకోవడం ద్వారా అనేక మంది యువతలో అవయవాలు దెబ్బతిని చనిపోతున్నట్లు డాక్టర్లు తెలిపారు.

Show comments