NTV Telugu Site icon

Periods: మందులతో పీరియడ్స్ ను వాయిదా వేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Periods

Periods

Using Tablets To Postpone Periods: అమ్మాయిలకు పీరియడ్స్ రావడం అనేది సహజ సిద్దంగా జరుగుతుంది. అయితే మన సంప్రదాయంలో పీరియడ్స్ లో ఉన్న టైంను అపవిత్రంగా భావిస్తారు. నెలసరి సమయంలో ఎలాంటి మంచి పనులలో పాల్గొనివ్వారు. పూర్వం అన్ని పనులు ఆడవారు చేసే వారు కాబట్టి పీరియడ్స్ టైం లో వారికి రెస్ట్ ఇవ్వకపోతే వారి ఆరోగ్యం చెడిపోతుందని అలా చేసేవారు. పీరియడ్స్ ఎక్కువ నీరసంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉండలేరు. నొప్పి వస్తూ ఉంటుంది. అందుకే ఏ పని చేయనివ్వరు రాను రాను అది ఆచారంగా మారిపోయింది. రుతుస్రావం జరుగుతున్నప్పుడు పూజా కార్యక్రమాలు, పెళ్లిలు, శుభకార్యాలకు హాజరుకాకూడదని నమ్ముతారు. అందుకే ఏదైనా శుభకార్యం ఉంటే చాలు ఇంట్లో మహిళలు తమ పీరియడ్స్ గురించి ఆలోచిస్తారు. ఇక దానిని వాయిదా వేయడానికి కొన్ని రకాల టాబ్లెట్లను తీసుకుంటూ ఉంటారు. వాటి ద్వారా నెలసరిని మన పని అయ్యేంత వరకు వాయిదా వేయాలనుకుంటారు. అయితే ఇలా తరచూ చేయడం వల్ల చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఆరోగ్యం దెబ్బ తింటుంది. సాధారణంగా మనం పీరియడ్స్ ను వాయిదా వేయడానికి షుగర్ పిల్స్,  ప్రోజెస్టిన్ మందులు వాడుతూ ఉంటాం.

Also Read: India Changed to Bharat: ‘ఇండియా’ని భారత్‌గా మార్చితే తప్పులేదు.. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి..

వీటిని వాడటం వల్ల హార్మొనల్ ఇమ్ బాలెన్స్ జరిగే అవకాశం ఉంది. మన నిద్ర, సెక్స్ సామర్థ్యం, మన ఎమోషన్స్, మన ఆలోచనలు అన్ని పీరియడ్స్ పై ఆధారపడి ఉంటాయి. వీటి కారణంగా వికారం, తలనొప్పి, రొమ్ము సున్నితత్వం, ఉబ్బరం, రుతు రక్తస్రావం నమూనాలలో మార్పులు వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. తరువాల రోజుల్లో పీరియడ్స్ క్రమ రహితంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే పుణ్య కార్యలు, పూజలు, పునస్కారాలు, పెళ్లిళ్లు అంటూ నెలసరిని వాయిదా వేయడానికి ఇలాంటి మందులు వేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి.