NTV Telugu Site icon

Tea Side Effects: టీ ఎక్కువగా తాగితే వృద్ధాప్యం వచ్చేస్తుంది..

Tea

Tea

మన దేశంలో ప్రసిద్ధి చెందిన పానీయాలలో టీ ఒకటి.. ఇక్కడ ప్రజలు రోజు ఒక కప్పు టీతో మొదలైతుంది. ఈ టీ సెషన్ రోజంతా ఆఫీసులో స్నేహితులతో కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా చలికాలంలో జలుబును నివారించడానికి ప్రజలు తరచుగా టీ తాగుతూ ఉంటారు. అయితే, దీన్ని అధిక మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా టీ తాగడం వల్ల మనం అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. టీ, గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ అన్నింటిలో కెఫిన్ ఉంటుంది.. ఇది క్రమంగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రిఫ్రెష్‌మెంట్ పేరుతో లేదా అర్థరాత్రి వరకు పని పేరుతో టీ తాగేవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.

Read Also: Sri Lakshmi Narasimha Stotra Parayanam: మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇట్టే తొలగిపోవాలంటే ఈ స్తోత్ర పారాయణం చేయండి

అయితే, రుచి కోసం కెఫిన్ టీకి చక్కెర వేసుకుంటారు. పదే పదే టీ తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి అసమతుల్యతకు దారి తీస్తుంది. ఎందుకంటే డయాబెటిస్ సమస్య కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల, టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదట ముఖంపై గీతలు ఏర్పడతాయి.. ఆ తర్వాత ఈ గీతలు ముడతలుగా మారుతాయి.. దీని కారణంగా మీరు మీ వయస్సు కంటే పెద్ద వారిగా కనిపిస్తారు. ఇక, బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో కూడా కెఫిన్ ఉంటుంది. ఇది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. ఎక్కువగా టీ తాగడం వల్ల మనకు తరచుగా మూత్రవిసర్జన చేస్తారు.. దీని వల్ల తగినంత నీరు త్రాగకపోవడంతో డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది.