Site icon NTV Telugu

Siddu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ – స్వరూప్ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన నాగవంశీ.

Siddu Jonnalagadda – Swaroop

Siddu Jonnalagadda – Swaroop

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో, ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో జోరుమీదున్నాడు. అదే స్పీడ్ తో తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్‌తో తన సత్తా చాటిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్ జే తో చేతులు కలిపాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఒక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తూ ఒక పవర్ ఫుల్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Also Read : Roja : కూతురు పెళ్లి, సినీ ఎంట్రీ వార్తలపై రోజా క్లారిటీ..

ఈ పోస్టర్‌ను గమనిస్తే, ఒక పల్లెటూరి వాతావరణం కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక భారీ మెషిన్ గన్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ‘ఏజెంట్’ సినిమాలో డిటెక్టివ్ కామెడీతో మాయ చేసిన స్వరూప్, ఈసారి సిద్దు జొన్నలగడ్డ కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది. టిల్లు మార్క్ కామెడీకి, స్వరూప్ మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సిద్ధూ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ వివరాలను వెల్లడించనున్నారు.

 

Exit mobile version