Siddhu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ – సితార ఎంటరైన్మెంట్స్.. సినిమా స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో తనదైన మేనరిజం మరియు టైమింగ్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే, డీజే టిల్లు వంటి సూపర్ హిట్స్ తర్వాత జాక్, తెలుసు కదా వంటి భారీ డిజాస్టర్స్ అందుకున్నాడు సిద్దు. దాంతో ఇప్పుడు రూటు మార్చి ఒక విభిన్నమైన జోనర్లోకి అడుగుపెడుతున్నాడు. ఉగాది కానుకగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
Also Read : UstaadBhagatSingh : ధురంధర్ – 2కు జై.. ఉస్తాద్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్.. ఫ్యాన్స్ ఫైర్
Also Read
ఈ చిత్రానికి అనిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘సాహో’కు ఆయన కో-రైటర్‌గా మరియు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిల్ ఇప్పడు దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లోనే ఇది ఒక విభిన్నమైన చిత్రమని తెలుస్తోంది. కమర్షియల్ అంశాలతో పాటు విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఉన్న ఫాంటసీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథా నేపథ్యం మరియు మేకింగ్ పరంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సిద్ధు జొన్నలగడ్డ మార్క్ ఎనర్జీకి ఫాంటసీ ఎలిమెంట్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వరుస ఫ్లోప్స్ తో ఇబ్బందిపడుతున్న సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!