సిద్దు జొన్నలగడ్డ నటించిన డిజే టిల్లు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది.. ఆ సినిమాలోని టైటిల్ సాంగ్ ఇప్పటికి వినిపిస్తుంది.. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా రాబోతుంది.. టిల్లు స్క్వేర్ టైటిల్ తో సినిమా రాబోతుంది.. ఈ సినిమా మార్చి 29 న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి.. రొమాన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అర్థమవుతుంది..
ఈ సినిమా విడుదలకు ఒక్క రోజే ఉండటంతో టీమ్ పమోషన్స్ లో స్పీడును పెంచారు.. పలు మీడియా ఛానెల్స్ కూడా ఇంటర్వ్యూ లు ఇస్తూ సినిమాను యూత్ కూడా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నారు.. తాజాగా ప్రముఖ న్యూస్ ఛానెల్ ఎన్టీవి కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ లు హాజరయ్యారు.. ఈ సందర్బంగా సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు..
ఈ క్రమంలో యాంకర్ ప్రశ్నలు అడుగుతూ ఆన్ సెట్స్ అన్నది.. కానీ వాళ్లకు సెక్స్ అని వినిపించింది.. అలా విన్న అనుపమ పరమేశ్వరన్ సిగ్గుతో తల దించుకొని సిగ్గుపడుతూ నవ్వుకుంది.. ఇక ఆ మాట విన్న హీరో కూడా యాంకర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. నవ్వుతూ వాట్.. నరాలు కట్ అయిపోతున్నాయ్.. ఏం మాట్లాడుతున్నావ్.. అంటూ సమాధానం ఇచ్చాడు.. దాంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..ఈ సినిమాకు యూ /ఏ సర్టిఫికెట్ ను అందుకుంది..ఇక థియేటర్లలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..