Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet District: సిద్దిపేట జిల్లా దామరకుంట దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల సైతం కలుగజేసుకోవడంతో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎర్రవల్లికి బయలుదేరారు.
మరోవైపు.. ఈ అంశంపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రసంగించారు. “పిరికితనంతో ప్రభుత్వం ఇలా వ్యవహారం చేస్తోంది. అసెంబ్లీకి రాకుండా మమ్మల్ని అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. అసెంబ్లీలో చర్చలు జరపడం ప్రభుత్వానికి ఇష్టం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉసిగొల్పి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పంపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండి కాంగ్రెస్ వాళ్ళను ఫామ్ హౌస్‌కు పంపుతున్నారు. పోలీసు ఎస్కార్ట్‌లు ఇచ్చి కేసీఆర్ ఇంటికి వద్దకు పంపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు. పై స్థాయి నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు పెట్టారు. నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారు. రేవంత్ రెడ్డికి ఇవి కొత్త కావచ్చు. అధికారంలో ఉన్న వాళ్ళ కాళ్ళు పెట్టుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్తున్న వారిని అరెస్టు చేస్తారా లేదా? జంగిల్ బ్యాచ్ పోలీసులను తీసుకువచ్చి మాపైన దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికి దెబ్బలు తగిలాయి. మేము దేనికి భయపడటం లేదు. జరిగిన సంఘటనకు ప్రభుత్వం భాద్యత వహించాలి. కేసీఆర్‌ను చంపడానికి వచ్చామని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన వారిని అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి బాసుల నుంచి కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు కాపాడుకున్నారు. కేసీఆర్‌ను కాపాడుకోవడానికి ఫామ్ హౌస్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలి.” అని డిమాండ్ చేశారు.
Also Read
- Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
- Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Elon Musk: ఇక 5 - 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
తాజావార్తలు
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
-
Operation Sindoor: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ సిగ్గుమాలిన చర్య.. భారత పార్లమెంట్‌ను ధ్వంసం చేశామని ఏఐ వీడియో
-
Ram Charan : చరణ్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. కానీ?
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో మరో కీలక పరిణామం.. హెడ్ కానిస్టేబుళ్లపై సిట్ ఫోకస్
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!