Site icon NTV Telugu

Brothers Died: మెట్ పల్లిలో విషాదం… తమ్ముడి మరణం తట్టుకోలేక ..

రక్తసంబంధం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఒకరి కష్టం వస్తే మరొకరు అల్లాడిపోతారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో విషాదం నెలకొంది. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న ప్రాణాలు వదిలాడు. మెట్ పల్లి పట్టణంలోని రెడ్డి కాలానికి చెందిన బొగ నాగ భూషణం టెంట్ హౌస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ముగ్గురు కుమారులు ఉండగా నిన్న మధ్యాహ్నం సమయంలో రెండో కుమారుడు బొగ శ్రీనివాస్ గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో విషాదం నెలకొంది. ఉదయం శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా మొదటి కుమారుడు బొగ సచిన్ స్మశాన వాటికలోనే కుప్పకూలాడు.

Read Also:Minister Roja: పవన్‌కు మంత్రి రోజా ప్రశ్న.. ప్రజల ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా?

అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు ఆసుపత్రి వైద్యులు. తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది. ఒకే రోజు వ్యవధిలో చేతికందిన ఇద్దరు కుమారులు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. అంత్యక్రియలకు వచ్చిన బంధువుల రోదనలు మిన్నంటాయి. మొదటి కుమారుడు సచిన్ కోరుట్ల పట్టణంలోని ఓ బ్యాంక్ లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు మరణించడంతో తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదని బంధువులు విచారం వ్యక్తం చేశారు.

Read Also: Ram Pothineni: దేవుడా.. రామ్ కు పెళ్లి అయ్యి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..?

Exit mobile version