UP COP Fails to Load, Fire Rifle : గన్‌లో బుల్లెట్ ఎక్కడ పెట్టాలో తెలియదు.. ఇతనో ఎస్ఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP COP Fails to Load, Fire Rifle : రైఫిల్ లోడ్ చేయడంలో యూపీ పోలీసు విఫలమయ్యాడు. సబ్-ఇన్‌స్పెక్టర్ రైఫిల్ లోడ్ చేయలేకపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఉత్తరప్రదేశ్ పోలీసులను తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. యూపీ సంత్ కబీర్ నగర్‌లోని పలు పోలీస్ట్ స్టేషన్‌లను ఐజీ ఆర్కే భరద్వాజ్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఖలీలాబాద్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. అక్కడ పోలీసుల పనితీరును గమనించే క్రమంలో వారికి గన్ ఫైరింగ్ పరీక్ష పెట్టారు. ఈ సమయంలో ఓ ఎస్సై ఐజీ ముందు అడ్డంగా బుక్కయ్యాడు.
Read Also: Bomb cyclone: గడ్డకట్టిన నయాగారా.. ఔరా అనిపిస్తున్న అద్భుత దృశ్యం
Also Read
బుల్లెట్ లోడు చేసి పైకి గన్ కాల్చమని ఐజీ చెప్పగా అతడు అయోమయంలో పడ్డాడు. బుల్లెట్ ఎలా లోడు చేయాలో కూడా కనీసం తెలియక ఇబ్బంది పడ్డాడు. చివరికి రైఫిల్ గొట్టం ద్వారా బుల్లెట్ లోపలికి తోసేశాడు. ఇది చూసిన ఐజీ ఆ ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సబ్ ఇన్‌స్పెక్టర్ తో పాటు మరికొందరు పోలీసు అధికారులు తనిఖీల్లో కాల్పులు జరపలేకపోయారు. ఔట్ పోస్ట్ ఇన్ ఛార్జి కూడా పదేపదే ప్రయత్నించిన తర్వాత కూడా టియర్ గన్‌ని ఆపరేట్ చేయడంలో ఇబ్బంది పడ్డారు. దీనిపై ఐజి భరద్వాజ్ స్పందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సాధన, శిక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఎలాంటి అనూహ్యమైన మోహరింపులకు సిద్ధంగా ఉండేందుకు శిక్షణను కొనసాగించాలని ఆయన పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
[WATCH] UP cop fails to load, fire rifle during surprise inspection pic.twitter.com/x6IZQRlheD
— Aaquil Jameel (@AaquilJameel) December 27, 2022
తాజావార్తలు
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్‌పై ఆప్ ఎదురుదాడి
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
-
RCB Player: యాడ్ షూట్ నుంచి డేటింగ్ వరకు.. ఆ నటితో ఆర్సీబీ ప్లేయర్‌కు పెళ్లి..?
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!