తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 84శాతం మంది అభ్యర్థులు పాస్ అయినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 30 మధ్యకాలంలో వివిధ విభాగాలకు సంబంధించి పరీక్షలు జరిగాయి. 1,79,459 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా.. 1,50,852 మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి 30 మంగళవారం రాత్రి నుంచి అభ్యర్థులు https://www.tslprb.in/లో లాగిన్ మార్కులు తెలుసుకోవచ్చని చెప్పారు.
Also Read : Shocking : పడకగదిలో ప్రియుడితో తల్లికి అడ్డంగా బుక్కయిన కూతురు.. ఆ తర్వాత ఏమైందంటే
ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ సివిల్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 1, 08, 055మంది పరీక్ష రాయగా 98,218 మంది, ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టులకు 57,848 మంది పోటీపడగా 43,708మంది పాస్ అయ్యారు. ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ ఐటీ అండ్ సీవో ఉద్యోగాలకు 4,564, ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టులకు 729, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు 1,779, ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాలకు 1,153, ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాలకు 463, ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టులకు 238 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
Also Read : Botsa Satyanarayana: టీడీపీని చూసి ఎందుకు భయపడతాం.. మంత్రి బొత్స కౌంటర్
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌లో చూసుకునే అవకాశం కల్పించారు. మరోవైపు మార్కుల విషయంలో అనుమానాలు ఉన్నవారు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవకాశం ఇచ్చారు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు రూ. 2 వేలు, ఇతరులు, నాన్ లోకల్ అభ్యర్థులు రూ. 3 వేలు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకొచ్చని తెలిపారు. జూన్ 1 ఉదయం 8 గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు లింక్ అందుబాటులో ఉంటుంది అని రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది.