NTV Telugu Site icon

Shyamala Krishnam Raju: రాజకీయాల్లోకి కృష్ణంరాజు భార్య..? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్యామలాదేవి

Shyamala

Shyamala

Shyamala Krishnam Raju: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు కుటుంబం మరోసారి ఎన్నికల బరిలో దిగుతుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. కృష్ణం రాజు జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. కృష్ణంరాజు జయవంతి వేడుకల్లో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.

Read Also: MLA Pendem Dorababu: పుట్టిన రోజు వేడుకల తర్వాత సైలెంట్‌ అయిన వైసీపీ ఎమ్మెల్యే..

కృష్ణంరాజు జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రజల అభీష్టం మేరకే తమ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందంటున్నారు శ్యామల కృష్ణంరాజు.. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలకు విద్య, వైద్య పరంగా ఏ కష్టం వచ్చినా మేం అండగా నిలబడతామని ప్రకటించారు. ఇక, కృష్ణం రాజు ఫ్యామిలీ మరోసారి రాజకీయాల్లో రావడం.. పోటీ చేయడం ఖాయమనే చర్చ సాగుతోంది.. గతంలో.. రెండు సార్లు పోటీ చేసి విజయం సాధించిన కృష్ణం రాజు.. కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు.. ఇక, ఆయన కన్నుమూసిన తర్వాత.. మొగల్తూరులో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. ఆ ఫ్యామిలీ మళ్లీ రాజకీయాలకు దగ్గర అవుతుందనే ప్రచారం సాగుతోంది.. అయితే, ఏ పార్టీ నుంచి బరిలోకి దిగుతారు..? అనేది దానిపై స్పష్టత రావాల్సి ఉంది.