Site icon NTV Telugu

Shubman Gill: శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత.. రికార్డులే రికార్డులు!

Shubman Gill

Shubman Gill

ఇంగ్లండ్‌ గడ్డ మీద టీమిండియా యువ కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్‌ దుమ్మురేపుతున్నాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (147) చేసిన గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 8 రన్స్ చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకం (269) చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) బాదాడు. గిల్‌ భీకర ఫామ్‌లో ఉన్న వేళ.. రెండో టెస్టులో భారత్ గెలుపు ముంగిట నిలిచింది. వరుస సెంచరీలు బాదిన గిల్ పలు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఓసారి చూద్దాం.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ 430 పరుగులు చేశాడు. దాంతో ఓ టెస్టులో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. గ్రాహం గూచ్‌ (456) మొదటి స్థానంలో ఉన్నాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో రెండు 150 ప్లస్ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్‌ అలెన్ బోర్డర్‌. బోర్డర్‌ 1980లో పాకిస్థాన్‌పై 150, 153 రన్స్ చేశాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, డబుల్‌ సాధించిన తొమ్మిదో బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఈ జాబితాలో భారత్‌ నుంచి సునీల్ గవాస్కర్ ఉన్నారు.

Also Read: Rishabh Pant: నాకు అంత అత్యాశ లేదు.. ఇంగ్లండ్ ప్లేయర్‌కు ‘పంత్’ పంచ్!

సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ తర్వాత టెస్టు మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన మూడో టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ మరో రికార్డు నెలకొల్పాడు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో గిల్‌ నాలుగు శతక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో నాలుగు సెంచరీ భాగస్వామ్యాల్లో భాగమైన తొలి భారత ఆటగాడు గిల్. ఇంకా మూడు టెస్టులు ఉన్న నేపథ్యంలో గిల్‌ మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version