Shubman Gill: టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను చిరకాలం నిలిచిపోయే విజయంతో ముగించింది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో విజయం కాసేపు అటూ.. మరికొద్ది సేపు ఇటూ.. ఊగిసలాడినా, చివరికి టీమిండియా 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీని ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయగలిగింది.
ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ చివరి వరకు పోరాడింది. అయితే మూడో రోజు సాయంత్రం 339/6 స్కోర్‌తో నిలిచిన ఇంగ్లండ్… మిగిలిన 35 పరుగుల తేడాను దాటలేక 367 పరుగులకే ఆలౌటైంది. ఈ అద్భుత కమ్‌బ్యాక్‌కు ప్రధాన కారణం టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణలు. మొత్తంగా ఈ ఇద్దరూ ఈ మ్యాచ్‌లో 17 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశారు.
Mohammed Siraj: లార్డ్స్లో బాధను.. ఓవెల్లో తీర్చుకున్న సిరాజ్ భాయ్! ఎలాగంటే?
ఇక మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. నేడు నా కెప్టెన్సీ జీవితంలో మరచిపోలేని రోజు. ఇరు జట్లు సిరీస్ మొత్తం అద్భుతంగా ఆడాయి. ఐదో రోజు విజయం ఎవరిదీ అనే విషయం స్పష్టంగా తెలియనంతగా మ్యాచ్ సాగింది. కానీ, చివరికి మేమే గెలిచాం. ముఖ్యంగా సిరాజ్, ప్రసిద్ద్‌ల స్పెల్‌లు విజయాన్ని అందించాయి. అలాగే గిల్ తన సహచరులపై ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖ్యంగా సిరాజ్ విషయంలో. సిరాజ్ లాంటి బౌలర్ జట్టులో ఉండాలి. అతను ప్రతి బంతికి ప్రాణం పెట్టి బౌలింగ్ చేశాడు. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు.. ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొత్తంలో అతని ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతని కష్టాన్ని చూసి మేం కూడా ఉద్వేగానికి లోనయ్యాం. ఏ కెప్టెన్‌కైనా అటువంటి పేసర్ దొరికితే అది అదృష్టమే అని అన్నాడు.
అలాగే తాను టాప్ స్కోరర్‌గా నిలవడంపైనా గిల్ ఆనందం వ్యక్తం చేశాడు. సిరీస్ మొదలు అవ్వడానికి ముందు చాలా కష్టపడ్డనని.. బెస్ట్ బ్యాటర్‌గా నిలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ టార్గెట్‌ను చేరుజున్నందుకు గర్వంగా ఉందని తెలిపాడు. అలాగే తాము విజయానికి అన్ని విధాలా ఆర్హులం అంటూ వ్యాఖ్యానించారు.
H. Couture Diamond Lipstick: లిప్‌స్టిక్ ధర అక్షరాల రూ.119 కోట్లు..! ఎందుకంటే
