Site icon NTV Telugu

Shubman Gill Fined: మ్యాచ్ గెలిచినా గుజరాత్‌కు షాక్.. గిల్‌కు భారీ జరిమానా..!

Shubman Gill

Shubman Gill

Shubman Gill Fined: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌కు గెలుపు దక్కినా, కెప్టెన్ శుభమాన్ గిల్ కు పెద్ద షాక్ తగిలింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్‌రేట్ కారణంగా బీసీసీఐ గిల్‌పై జరిమానా విధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 210/4 భారీ స్కోర్ నమోదు చేసింది. గిల్ 70 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ 55, జొస్ బట్లర్ 52 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఢిల్లీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ 3/17తో రాణించగా, ప్రసిద్ కృష్ణ 2 వికెట్లు తీశాడు.

Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

చేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున KL రాహుల్ 92 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా డేవిడ్ మిల్లర్ 41* తో మ్యాచ్‌ ను చివరి వరకు తీసుకెళ్లినా, కీలక సమయంలో తీసుకున్న నిర్ణయం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి రెండు బంతులకు రెండు పరుగులు అవసరమైన సమయంలో మిల్లర్ సింగిల్ తీసుకోకపోవడం, చివరి బంతికి కుల్‌దీప్ యాదవ్ రన్ అవుట్ కావడంతో ఢిల్లీ 209/8కే పరిమితమైంది.

Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

ఇక మ్యాచ్ తర్వాత గుజరాత్ టైటాన్స్ స్లో ఓవర్‌రేట్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐపీఎల్ కమిటీ గుర్తించింది. దీంతో ఆర్టికల్ 2.22 ప్రకారం గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో ఇది అతని మొదటి తప్పిదం కావడంతో కేవలం జరిమానాతోనే సరిపెట్టారు. ఈ సంఘటనతో గిల్ శిక్షలు ఎదుర్కొన్న కెప్టెన్ల జాబితాలో చేరాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో సస్పెన్షన్‌ లకు బదులుగా జరిమానాలు, డీమరిట్ పాయింట్లు విధించే విధానం అమల్లో ఉంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో మూడు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

Exit mobile version