Site icon NTV Telugu

Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా.. ముహూర్తం ఖరారు?

Shubhanshu Shukla

Shubhanshu Shukla

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో అడుగుపెట్టిన మొట్ట మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుకెక్క బోతున్నాడు. స్పేస్‌ఎక్స్‌(SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతి కూడా ఇటీవల లభించింది. తాజాగా అంతరిక్ష కేంద్రానికి శుక్లా ఎప్పుడు వెళ్తారనే అంశంపై తెరపడింది. యాక్సియమ్‌-4 మిషన్‌లో భాగంగా మే నెలలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌, ఇస్రో పనులపై సమీక్ష అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.

READ MORE: Pranav : మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ డేటింగ్.. ఆ దేశం అమ్మాయితో..

‘‘గ్రూప్‌ కెప్టెన్‌ శుక్లా ప్రయాణం ఎంతో కీలకమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ కొత్త శకంలోకి దూసుకెళ్తుందనడానికి ఇదో సంకేతం’’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. కాగా.. యాక్సియమ్‌–4 మిషన్‌లో భాగంగా నలుగురు ప్రైవేట్‌ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని కి చేరుకోనున్నారు. 14 రోజుల తర్వాత తిరిగి వస్తారు. ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైతం భాగస్వా మిగా మారింది. డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ సారథ్యం వహించనున్నా డు. పోలాండ్‌కు చెందిన ఉజ్‌నాన్‌స్కీ, హంగేరీకి చెందిన టిబో ర్‌ కపూ సైతం ఇందులో పాలుపంచుకుంటున్నా రు. మొత్తం నలుగురు అస్ట్రోనాట్స్‌ డ్రాగన్‌ అంతరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్‌కు చేరుకుంటారు. త్వరలో ఈ ప్రయోగం చేపట్టడానికి ఏర్పాట్లు పూర్త య్యాయి. శుభాంశు శుక్లా ప్రస్తుతం భార త వైమా నిక దళంలో గ్రూప్‌ కెప్టెన్‌గా పనిచేస్తున్నారు.

READ MORE: Gurugram: ఐసీయూలో ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు

Exit mobile version