Sruthi Hasan : మరో సినిమా నుంచి కూడా శృతి అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sruthi Hasan : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన టాలెంట్ తో చాలా తొందరగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే ఆమె గత కొన్నేళ్లుగా సినిమాల విషయంలో ఎందుకో కాస్త గ్యాప్ ఎక్కువ తీసుకుంటుంది. చివరిగా తను ప్రభాస్ తో కలిసి ‘సలార్’ మూవీలో కనిపించింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఆమె నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు. నిజానికి ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది. సినిమాకు ఆమె పాత్ర చాలా కీలకమని టాక్ వినిపిస్తోంది.
Read Also : Off The Record : ఆ BRS లీడర్స్ భయపడుతున్నారా.? వాళ్ళను వెంటాడుతున్న భయమేంటి.?
Also Read
- Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
- Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
- NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
అదేవిధంగా తెలుగులో అడివి శేష్ హీరోగా ‘డెకాయిట్’ మూవీలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. సినిమాలో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ఆ మధ్య డెకాయిట్ మూవీ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఎందుకో తెలీదు కానీ ‘డెకాయిట్’ మూవీ నుంచి ఆమె తప్పుకుంది. షూటింగ్ ఆలస్యం కావడం వలన డేట్స్ అడ్జస్ట్ చేయలేక డెకాయిట్ నుంచి తప్పుకుందని ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా నుంచి కూడా శృతి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండో-ఆంగ్లో బేస్డ్ ప్రొడక్షన్ లో ‘చెన్నై స్టోరీ’ అనే సినిమాకి గతంలో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాను సమంత చేయాల్సింది. అయితే ఆమె మాయోసైటిస్ బారిన పడడంతో ‘చెన్నై స్టోరీ’ ప్రాజెక్ట్ ను ఆమె వదులుకుంది. దీంతో ఈ మూవీలో మెయిన్ లీడ్ కోసం శృతి హాసన్ ని కన్ఫర్మ్ చేశారు. ఎందుకనో సడెన్ గా ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందన్న వార్త వస్తుంది.
Read Also : CM Chandrababu : ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆమె తప్పుకోవడంతో ఇప్పుడు ఈ చిత్రం కోసం వేరొక హీరోయిన్ ని తీసుకునే పనిలో పడ్డారు మేకర్స్. ఇలా రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ని అయితే శృతి హాసన్ ఈ మధ్యకాలంలో వదులుకుని అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘కూలి’ మాత్రమే ఉంది. ‘సలార్ పార్ట్ 2’ ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ అయితే లేదు. అయిన కూడా డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుందనే కారణం చూపించి చేతికి అందివచ్చిన ప్రాజెక్ట్స్ ను వదులు కుంటుంది. అయితే దీనికి రీజన్ ఏంటనేది స్పష్టత లేదు. ప్రస్తుతం ఆమె సినిమాలు కాకుండా మ్యూజిక్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తోందనే ప్రచారం నడుస్తోంది. అందుకే చేతిలో ఉన్న సినిమాలు వదులుకుందనే మాట వినిపిస్తోంది.
తాజావార్తలు
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!