Sruthi Hasan : వయసుకు వచ్చిన ప్రతి అమ్మాయి తనకు కాబోయే భర్త ఇలా ఉండాలి.. అలా ఉండాలని కలలు కంటుంది. భర్త విషయంలో ఏ అమ్మాయికైనా కొన్ని కోరికలు ఉంటాయి. అందుకే చేసుకోబోయే వాడిని ఎంచుకునే ముందుకు ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది. చేసుకునే వాడి లో ఆ క్వాలిటీలు..ఈ క్వాలిటీలు ఉండాలని ఓపెన్ వారి సన్నిహితుల దగ్గర చెబుతుంటారు. ఈ విషయంలో ఎవరైనా ఒక్కటే.. సామాన్యుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు తమ భర్తలో ఫలానా క్వాలిటీలు ఉండాలని కోరుకుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా తను చేసుకోబోయే భర్త విషయంలో తొలిసారి ఓపెన్ అయింది. `అతడు ఆదర్శంగా ఉండాలి. నన్ను ఎప్పుడూ జోక్స్ వేసి నవ్వించాలి. చాలా క్రియేటివ్ గా ఉండాలి. అలాగే ఇతరుల్లో స్పూర్తిని సైతం నింపేలా ఉండాలి. అలాంటి వాడంటేనే నాకు ఇష్టం` అని తెలిపింది.
Read Also:Off The Record : బీఆర్‌ఎస్ పోగొట్టుకున్న చోటే వెతుకుంటుందా?
ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కామెంట్లను యాడ్ చేస్తూ శృతిహాసన్ మాజీ భాయ్ ప్రెండ్ కథలు తవ్వి తీస్తున్నారు నెటిజన్లు. శృతిహాసన్ తొలిసారి విదేశీయుడు మైఖెల్ కోర్సలేతో ప్రేమలో పడిన సంగతి తెలిసింది. సినీఇండస్ట్రీకి వచ్చిన తర్వాత శృతి తొలి ప్రేమికుడు అతడే. అతడి కోసం కెరీర్ ని సైతం పక్కనబెట్టింది. తన తండ్రి కమల్ హాసన్ కు కూడా పరిచయం చేసింది. నేరుగా ఇంట్లోనే లంచ్..డిన్నర్ పార్టీలు ఎంజాయ్ చేశారు. కానీ ఆ బంధం కొంత కాలమే సాఫీగా సాగింది.
Read Also:MP K.Laxman : రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైన జీవో 29ను రద్దు చేయాలి
కారణం ఏంటో తెలీదు కానీ వారిద్దరూ విడిపోయారు. శ్రుతి హాసన్ మాత్రం మానసిక సంఘర్షణకు గురైంది. అటుపై కొంత గ్యాప్త తీసుకుని ముంబై కి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో మరోసారి లవ్ లో పడింది. ఇతడితోనూ బాగానే సావాసం చేసింది. క్లోజ్ గా మూవ్ అయింది. అయితే తొలి ప్రేమ వైఫల్యంతో రెండవసారి జాగ్రత్త పడింది. మనసును మరీ అంతగా గాయపరుచుకోలేదు. కొంతకాలం అనంతరం అమ్మడు ఇతడికి బ్రేకప్ చెప్పింది. శంతను తో జర్నీ క్రేజీ ప్రయాణమని, తనతో ఉన్నంత కాలం తన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను అంది. శ్రుతి హాసన్ కోరుకున్న లక్షణాలు వాళ్లిద్దరిలో లేవా అని నెటిజన్లు ప్రశ్నిస్తు్నారు.