Site icon NTV Telugu

Shruti Haasan : బ్రేకప్ తర్వాత స్పీడ్ తగ్గించిన శృతి హాసన్

Sruthi

Sruthi

2023లో బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, ప్రభాస్ సలార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు చూపించిన శృతి హాసన్ స్పీడ్‌పై దెబ్బేసింది తన లవ్‌ బ్రేకప్. 2024లో బాయ్ ఫ్రెండ్ శాంతను హాజరికాకు గుడ్ బై చెప్పిన శృతి హాసన్ పర్సనల్ లైఫ్ నుండి త్వరగానే బయటపడినప్పటికీ యాక్టింగ్ కన్నా.. సింగింగ్ టాలెంట్‌పై ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్‌ చేసింది. కాదలిక్క నేరమిల్లే, థగ్ లైఫ్‌ సినిమాల్లో పాటలు పాడిన శృతి.. ఆ తర్వాత వారణాసిలో పాటపాడటమే కాదు… టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఫంక్షన్‌లో స్పెషల్ ఫెర్ఫామెన్స్ ఇచ్చి సినిమాలు చేయట్లేదు అన్న లోటు పూడ్చుకుంది. గత ఏడాది కూలీలో రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రుతి నుండి ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. కొత్తగా ఓకే చేసిన సినిమాల గురించి కూడా చెప్పట్లేదు. ఎప్పుడో కంప్లీటైన ట్రైన్ థియేటర్స్‌లో రావడానికి మీన మేషాలు లెక్కిస్తుంటే.. సలార్2లో ఈమె ఉందా లేదా అన్న డౌట్స్‌ స్టార్టయ్యాయి.

Also Read : TheRajaSaab : అఫీషియల్ రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసిన హాట్ స్టార్

వీటన్నింటికి తన 40వ బర్త్ డేతో క్లారిటీ ఇచ్చేసింది. సలార్2లో శృతి ఉన్న విషయాన్ని ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కన్ఫార్మ్ చేసింది మూవీ టీం. సలార్2 సెట్స్‌లో కలుద్దాం అంటూ బర్త్‌డే విషెస్‌ ట్వీట్ వేసింది. చాలా రోజుల క్రితమే షూటింగ్‌ కంప్లీట్ చేసుకున్న విజయ్ సేతుపతి – మిస్కిన్ సినిమా ట్రైన్ కూడా త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే 65 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటి వరకు కోటి రూపాలు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదట. సో ఈ సినిమా వస్తుందా రాదా అన్నది డౌటే. అలాగే చియాన్ విక్రమ్ 63లో హీరోయిన్‌గా ఫిక్సైనట్లు సమాచారం. అయితే దీని గురించి అఫీషియల్‌గా కన్‌ఫర్మేషన్‌ రావాల్సి ఉంది. సలార్ తర్వాత తెలుగులో కనిపించని శృతి హాసన్ సీక్వెల్ కన్నా ముందే మరో టాలీవుడ్ మూవీతో హాయ్ చెప్పబోతుంది. దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఓ తారలో నటిస్తోంది. బర్త్ డే సందర్భంగా ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తూ విషెస్ తెలిపింది స్వప్నా సినిమాస్. ఇందులో సిగార్ కాలుస్తున్న శృతి లుక్ రివీల్ చేసింది టీం.

Exit mobile version