Shruti Haasan : అరుదైన జబ్బుతో పోరాడిన చిన్నారి ప్రాణాలు కాపాడిన శృతి హాసన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం వెండితెరపై చూసే స్టార్లు నిజ జీవితంలో ఎలా ఉంటారో అని అందరికీ ఆసక్తి ఉంటుంది. కొందరు గ్లామర్‌కే పరిమితమైతే, మరికొందరు తమకున్న స్టార్‌డమ్‌ని తోటివారికి సాయం చేయడానికి వాడుతుంటారు. ఆ కోవలోకే వస్తుంది టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్. తాజాగా ఒక అరుదైన జబ్బుతో చావుబతుకుల్లో ఉన్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడి, ఆ కుటుంబానికి దేవుడిలా అండగా నిలిచింది ఈ ముద్దుగుమ్మ.
Also Read : Ramayana : రణబీర్‌లో రాముడినే చూస్తారు – అరుణ్ గోవిల్ సెన్సేషనల్ కామెంట్స్!
Also Read
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
‘ఆళ్వి’ అనే చిన్నారికి పుట్టుకతోనే MSMD అనే చాలా అరుదైన జన్యు సంబంధిత వ్యాధి వచ్చింది. పాపం ఆ పసిపాప పుట్టినప్పటి నుంచీ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అయితే 2025లో ఆ చిన్నారికి ఎముక మజ్జ మార్పిడి (Bone Marrow Transplant) చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్లిష్ట సమయంలో శృతి హాసన్ ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. పాప పరిస్థితి సీరియస్ అయ్యి ఐసీయూలో ఉన్నప్పుడు, శృతి హాసన్ ఊరికే డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోలేదు. స్వయంగా రంగంలోకి దిగి, బెస్ట్ డాక్టర్లతో మాట్లాడి పాపకు మెరుగైన వైద్యం అందేలా చూసింది. డాక్టర్ ధరణి, డాక్టర్ దివ్య వంటి నిపుణులను ఆ ఫ్యామిలీకి పరిచయం చేసి, ఆ పాప ప్రాణాలు దక్కేలా చేసింది. వైద్యంతో పాటు ఆర్థికంగా, మానసికంగా కూడా ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చింది.
ఇటీవల ఆ చిన్నారి ఆళ్వి తన పేరెంట్స్‌తో కలిసి శృతిని కలిసింది. ఆ సమయంలో శృతి ఆ పాపతో ఆడుకుంటున్న వీడియో చూస్తుంటే ఎవరికైనా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. “మా పాప ఈరోజు బతికి ఉందంటే అది కేవలం శృతి గారి వల్లే” అంటూ ఆ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు. శృతి ఆ పాప కోసం ఒక పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి ఇస్తూ, తన సొంత ఇంటి మనిషిలా ఆదరించిందట.
తాజావార్తలు
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!