Site icon NTV Telugu

Shruthi Hasan : నెటిజెన్ అడిగిన ఆ ప్రశ్నకు క్రేజీ ఆన్సర్ ఇచ్చిన శృతిహాసన్.

Whatsapp Image 2023 08 01 At 10.14.00 Am

Whatsapp Image 2023 08 01 At 10.14.00 Am

శృతి హాసన్‌ ఈ భామ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఆమె టాలీవుడ్‌ సినిమాల నుంచే వరుస విజయాలను అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో `సలార్‌’ సినిమాలో నటించింది.ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ భామ వరుస సినిమాలతో బిజీ గా వున్నా కానీ సోషల్‌ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది.అలాగే తరచూ తన అభిమానులతో చిట్‌ చాట్‌ చేస్తూ ఉంటుంది.వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతుంది. ఇలా అభిమానులకు నిత్యం టచ్‌ లో ఉండే ఈ అందాల భామకు ఫ్యాన్స్ నుంచి కొన్ని విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతుంటాయి.అలాగే కొన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కూడా వస్తుంటాయి.

తాజాగా శృతి హాసన్‌ తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. కానీ కొన్ని వెరైటీ ప్రశ్నలు ఆమెకి ఎదురయ్యాయి. కొందరు నెటిజన్లు ఆమెను అడిగిన చిలిపి ప్రశ్నలకు శృతి కూడా అంతే క్రేజీగా సమాధానం చెప్పడం విశేషం. ఇందులో కొందరు ఆమెను తన చిన్నప్పటి ఫోటో పెట్టమని ఒకరు, రెడ్‌ డ్రెస్‌లో వున్నా ఫోటోని పెట్టమని,అలాగే బాయ్‌ ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోని షేర్‌ చేయమని, ఇలా వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి.అందులో భాగంగా ఓ నెటిజన్‌ వెరైటీ ప్రశ్న ను అడిగాడు. తన పాదాల ఫోటోను షేర్ చేయమని అడిగాడు.దీనికి షాక్ అయిన శృతి ఓ క్రేజీ ఫోటోను వదిలింది. అది ఒక వింత జంతువు కాళ్లో లేక ఏలియన్‌ కాళ్లో తెలియదు కానీ ఎంతో వింతగా ఉంది..దీనితో ఆ ప్రశ్న అడిగిన నెటిజెన్ షాక్ అయ్యాడు.ఈ వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది.

Exit mobile version