NTV Telugu Site icon

Shriya Saran : బీచ్ లో హాట్ లుక్ తో రచ్చ చేసిన శ్రీయా శరణ్..

Whatsapp Image 2023 09 19 At 9.21.47 Pm

Whatsapp Image 2023 09 19 At 9.21.47 Pm

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరొందిన ఈ సీనియర్ బ్యూటీ అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ బాగానే రానించింది.శ్రియా శరన్  సినీ కెరీర్ టాలీవుడ్ చిత్రాలతోనే ప్రారంభమైంది. 2001లో వచ్చిన ‘ఇష్టం’ చిత్రంతో నటిగా తెలుగు తెరపై తొలిసారిగా కనిపించింది.. ‘సంతోషం’ చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. అప్పటి నుంచే టాలీవుడ్ లో ఈ బ్యూటీ కి మంచి క్రేజ్ లభించింది.
టాలీవుడ్ లో టాప్ స్టార్ లతో నటించి మెప్పించింది.ప్రేక్షకులనూ తన నటన మరియు అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ వరుస చిత్రాలతో అలరిస్తోంది.19 మార్చి 2018న తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్‌ను వివాహం చేసుకుంది. శ్రీయ రెండేళ్ల కింద పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

పెళ్లి తర్వాత ఈ భామ సినిమాల జోరు కాస్త తగ్గించింది. ఎక్కువ సమయం తన ఫ్యామిలీతో గడిపేందుకు కేటాయిస్తోంది.ఈ క్రమంలో శ్రియా భర్త, కూతురుతో వరుసగా వెకేషన్లు మరియు టూర్లకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు టూర్ అప్డేట్స్ శ్రీయ తన ఫ్యాన్స్ కు అందిస్తోంది. టూర్ కి సంబంధించిన ఫొటోలనూ షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.ఇక రీసెంట్ గా సెప్టెంబర్ 11న శ్రియా శరన్ పుట్టిన రోజు కావడంతో . ఈ సందర్భంగా తన భర్త, కూతురుతో కలిసి వెకేషన్ కు వెళ్లింది.. తాజాగా అప్పటి వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది.బీచ్ లో రచ్చ చేస్తూ కనిపించింది. లేటెస్ట్ గా శ్రియా పంచుకున్న ఫొటోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బీచ్ లో ఈ బ్యూటీ పొట్టి దుస్తుల్లో మెరిసింది. థైస్ అందా లు చూపిస్తూ మైమరిపించింది. మరోవైపు ఫిట్ నెస్ తో ఆకట్టుకుంది. మరో అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ తో రెచ్చగొట్టింది.శ్రీయా వయసు నాలుగు పదులు దాటినా నాజుకైన అందాలతో మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి