NTV Telugu Site icon

World Cup 2023: ఈ వరల్డ్‌కప్‌లో ఇదే భారీ సిక్సర్.. అయ్యర్ అయ్యారే అనిపించాడు..!

Ayyer

Ayyer

World Cup 2023: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లంకేయుల ముందు భారీ స్కోరును ఉంచారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. ఓ భారీ సిక్సర్ కొట్టాడు. 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్‌ మీదగా అయ్యర్ సిక్స్‌ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బాల్ 106 మీటర్ల దూరం వెళ్లింది. ఈ టోర్నీలో ఇదే భారీ సిక్సర్..

Read Also: Atchannaidu: చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా?

ఈ వరల్డ్ కప్ లో ఇంతకుముందు ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ 104 మీటర్ల సిక్స్ కొట్టాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 మీటర్ల సిక్సర్ కొట్టగా.. తాజాగా శ్రేయాస్ అయ్యర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు గిల్(92), కోహ్లీ(88) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును ఉంచారు.

Read Also: Canada: కెనడాలో శాశ్వతం స్థిరపడాలనుకునే వారికి గుడ్ న్యూస్.. 4.85 లక్షల మందికి పీఆర్..