NTV Telugu Site icon

IPL 2025: మొదటి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించనున్న శ్రేయాస్ అయ్యర్..!

Shreyas Ayyar

Shreyas Ayyar

పంజాబ్ కింగ్స్ తమ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఆదివారం ప్రకటించింది. ఐపీఎల్ 2025లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌కి కెప్టెన్సీ చేస్తే భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించనున్నాడు. రెండు కంటే ఎక్కువ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు. ఇప్పటి వరకు ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అయితే ఆ ఇద్దరు క్రికెటర్లు విదేశీయులే. తొలిసారిగా మూడు జట్లకు సారథ్యం వహించిన అవకాశం భారతీయుడికి దక్కింది.

Read Also: Jayam Ravi: నన్ను ఇక అలా పిలవద్దు.. పండుగ నాడు జయం రవి కీలక ప్రకటన

ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం కానుంది. మొహాలీకి చెందిన ఫ్రాంచైజీ రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. శ్రేయాస్ కెప్టెన్సీలో 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే.. 18 సీజన్లలో శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ జట్టుకు 17వ కెప్టెన్.. పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు కెప్టెన్లను మార్చినంతగా మరే జట్టు మార్చలేదు.

Read Also: Breaking: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మందికి తీవ్ర గాయాలు

ఐపీఎల్‌లో మూడు జట్లకు సారథ్యం వహించిన తొలి భారత ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. శ్రేయాస్ అయ్యర్ 2018 సీజన్ మధ్య నుండి 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. అతను జట్టును ఒక సీజన్‌లో ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2022, 2024 లో KKR కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లతో ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఏకైక కెప్టెన్ కూడా ఇతనే.. శ్రేయాస్ కంటే ముందు మూడు జట్లకు మహేల జయవర్ధనే, స్టీవ్ స్మిత్ సారథ్యం వహించారు. జయవర్ధనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్మిత్ పూణే వారియర్స్ ఇండియా, రైజింగ్ సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు.

Show comments