Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!

  • న్యూజిలాండ్‌పై రికార్డు ఛేజింగ్
  • నమన్ ధీర్‌పై శ్రేయాస్ అయ్యర్ ప్రశంసలు.
Shreyas Iyer

Shreyas Iyer

Shreyas Iyer: న్యూజిలాండ్‌తో తొలి టీ20లో రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలోనూ నమన్ ఎంతో ప్రశాంతంగా, సంయమనంతో ఉండటం జట్టుకు ఎంతో అవసరమన్నాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక విజయవంతమైన ఛేజింగ్. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ 33 బంతుల్లో 67 పరుగులతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్ 28 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే చివర్లో నామన్ ధీర్ కేవలం 15 బంతుల్లోనే 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

గత నెలలో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన నమన్ ధీర్‌ను శ్రేయస్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. నమన్ జట్టుకు ఎన్నో ప్రత్యామ్నాయాలను అందించగలడని అన్నారు. అంతేకాకుండా అతడో అద్భుతం అని కితాబిచ్చాడు. ముఖ్యంగా ఎడమచేతి వాటం బ్యాటర్లపై అతడి ఆఫ్‌స్పిన్ ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇంకా అతడి రెండు, మూడు కీలక ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలవు. వ్యక్తిగతంగా అతడి ప్రశాంతమైన, సంయమనంతో కూడిన స్వభావం నాకు బాగా నచ్చింది. ఈ రోజు అతడు ఆడిన తీరు చూడటం అద్భుతంగా అనిపించిందని శ్రేయస్ అన్నాడు. కాకపోతే ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్‌తో తొలి టీ20లో నామన్‌కు బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.

మ్యాచ్ ఆరంభంలో పిచ్ కొంత నెమ్మదిగా ఉందని శ్రేయస్ తెలిపాడు. బంతి బ్యాట్‌పైకి నేరుగా రాకుండా ఆగి వచ్చినట్లు అనిపించిందని చెప్పాడు. అందుకే బ్యాటర్లకు ఇబ్బంది కలిగించే లెంగ్త్‌లో బౌలింగ్ చేయాల్సి ఉండగా.. కొన్ని బంతులు సరైన ప్రాంతంలో పడలేదని పేర్కొన్నాడు. ఆట కొనసాగుతున్న కొద్దీ మంచు ప్రభావం పెరగడంతో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిందని శ్రేయస్ అన్నారు. బంతి బ్యాట్‌పైకి చక్కగా రావడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు 220కిపైగా పరుగులు చేయగలిగారని తెలిపాడు. అలాగే భారత్ పవర్‌ప్లేలోనే ఒక వికెట్ నష్టానికి 94 పరుగులు చేసి లక్ష్య ఛేదనకు బలమైన పునాది వేసింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ దూకుడైన ఆరంభాన్ని శ్రేయస్ ప్రశంసించాడు. వారికి ఎలా బ్యాటింగ్ చేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో వారికి బాగా తెలుసు. ఒకసారి ఫామ్ అందుకుంటే అదే వేగాన్ని కొనసాగిస్తారు. ఈ రోజు మ్యాచ్ అందుకు మంచి ఉదాహరణ అని శ్రేయస్ పేర్కొన్నాడు.