NTV Telugu Site icon

IPL Records: ఐపీఎల్‌లో ధోని రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్

Shreyas Ayyar

Shreyas Ayyar

IPL Records: 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్‌లలో ఒకటిగా పేరొందింది. ఐపీఎల్‌లో అనేక దిగ్గజ ఆటగాళ్లు తమ ప్రతిభను చూపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇందులో ప్రతి సీజన్‌లో కొత్త రికార్డులు, కొత్త మైలురాళ్లు నమోదవుతుంటాయి. తాజాగా 2025 ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ విశేషమైన రికార్డు సాధించాడు. ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టు దూసుకెళ్తుంది. ఈ సీజన్ లో పంజాబ్ ఆడిన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి, ఆ తర్వాత రెండో మ్యాచ్‌ లోనూ అదేస్థాయిలో రాణించి లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించింది. ఈ విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.

Read Also: ICC Rankings: అంతర్జాతీయ మ్యాచులు ఆడకపోయినా టాప్ లేపిన టీమిండియా ఆటగాళ్లు

ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ రికార్డుల జాబితాలో దూసుకెళ్తున్నారు. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వరుసగా ఎనిమిదో విజయాన్ని సాధించాడు. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన ఆయన వరుసగా ఆరు విజయాలు అందుకున్న అతను, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుతో రెండు విజయాలను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. దీంతో అతను ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్‌ రికార్డుతో సమానంగా నిలిచాడు. అయితే సిఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును అధిగమించాడు. ఇంతకముందు ధోనీ వరుసగా ఏడు విజయాలు నమోదు చేసాడు. దీనితో ధోని రికార్డ్ ను బ్రేక్ చేసానట్లు అయ్యింది. అయితే ఈ లిస్ట్ లో గౌతమ్ గంభీర్ 10 వరుస విజయాలతో అగ్ర స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా వరుసగా ఎక్కువ విజయాలు సాధించిన ఆటగాళ్ల లిస్ట్ లో మరోమారు గౌతమ్ గంభీర్, ధోనీ రెండు సార్లు వరుసగా 6 విజయాలు అందుకోగా.. వీరితోపాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున కేన్ విలియమ్సన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా 6 విజయాలు సాధించారు.