Shreyas Iyer Record: ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ఎంఎస్ ధోనీ రికార్డు బ్రేక్!
- ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర
- అత్యధిక వరుస విజయాలు అందుకున్న కెప్టెన్‌గా శ్రేయస్
- 10 వరుస విజయాలతో అగ్రస్థానంలో గౌతీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వరుస విజయాలు అందుకున్న రెండో కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు. సారథిగా శ్రేయస్ వరుసగా 8 విజయాలు సాధించాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ విజయం సాధించడంతో శ్రేయస్ ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సారథిగా ఆరు విజయాలు సాధించిన శ్రేయస్.. ఐపీఎల్ 2025లో పంజాబ్ తరఫున రెండు విజయాలు ఖాతాలో వేసుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం షేన్ వార్న్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా వార్న్ 8 విజయాలు సాధించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును శ్రేయస్ అయ్యర్ బ్రేక్ చేశాడు. 2013లో చెన్నై సారథిగా ఏడు వరుస విజయాలు సాధించి.. మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2014-15లో గౌతీ కేకేఆర్ తరఫున 10 వరుస విజయాలు అందుకున్నాడు.
Also Read
Also Read: IPL 2025: సంజీవ్ గోయెంకా.. ఆ అలవాటు మంచిది కాదయ్య!
కెప్టెన్‌గా ఐపీఎల్‌లో వరుసగా అత్యధిక విజయాలు:
10 – గౌతమ్ గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 2014-15
8 – షేన్ వార్న్ (రాజస్థాన్ రాయల్స్) – 2008
8 – శ్రేయాస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్) – 2024-25
7 – ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) – 2013
6 – గౌతమ్ గంభీర్ (కోల్‌కతా నైట్ రైడర్స్) – 2012
6 – ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) – 2014
6 – కేన్ విలియమ్సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 2018
6 – ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్) – 2019
6 – ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 2024
తాజావార్తలు
-
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!