NTV Telugu Site icon

Duleep Trophy 2024: శ్రేయస్ డకౌట్‌.. సంజూ కూడా విఫలం! ఇలా అయితే కష్టమే

Shreyas Iyer Test

Shreyas Iyer Test

దులీప్‌ ట్రోఫీ 2024లో రెండో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అనంతపురంలో ఇండియా సితో ఇండియా డి టీమ్ తలపడుతోంది. ఇండియా డి కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ నిరాశపరిచాడు. 7 బంతులు ఎదుర్కొన్న శ్రేయాస్.. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఆకిబ్ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కెప్టెన్‌గా కీలక ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అతడు విఫలమవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇలాగే ఆడితే భారత జట్టులోకి రావడం కష్టమే అని కామెంట్స్ చేస్తున్నారు. అనంతపురంలో ఎండ వేడిని తట్టుకోలేక బ్యాటింగ్‌కు వచ్చే సమయంలో శ్రేయస్‌ సన్‌గ్లాసెస్‌ను పెట్టుకోవడం గమనార్హం.

దులీప్‌ ట్రోఫీలో ఆడుతున్న సంజూ శాంసన్‌ కూడా విఫలమయ్యాడు. ఇండియా డి తరఫున బరిలోకి దిగిన సంజూ.. ఆరు బంతులు ఎదుర్కొని ఐదు పరుగులే చేశాడు. కీలక సమయంలో క్రీజ్‌లో ఉండాల్సిన అతడు అవుట్ అవ్వడం సంజూ అభిమానులను నిరాశకు గురిచేసింది. మరోవైపు ఇషాన్‌ కిషన్‌ సెంచరీ చేయడంతో సంజూకు భారత జట్టులోకి రావడం మరింత ఇబ్బందిగా మారింది. తదుపరి ఇన్నింగ్స్‌లోనైనా సంజూ రాణించాల్సిన ఆవశ్యకత ఉంది.

Also Read: Poonam Kaur: ఓనమ్‌ వెలుగులు.. పూనమ్ కౌర్ సొగసులు!

ఈ మ్యాచులో ఇండియా ఎ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. షామ్స్ ములానీ (89), తనుష్ కోటియన్ (53) పరుగులు చేశారు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (7) మరోసారి తక్కువ స్కోరుకే అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఇండియా డి 164/8 స్కోరుతో కొనసాగుతోంది. దేవదత్ పడిక్కల్ (92) జట్టును ఆదుకున్నాడు. హర్షిత్ రానా, అర్ష్‌దీప్‌ సింగ్‌ క్రీజులో ఉన్నారు. ఇండియా డి ఇంకా 120 పరుగులు వెనకబడి ఉంది.

Show comments