Shraddha Case: నార్కో టెస్టులో శ్రద్ధను ఎలా చంపాడో తెలిపిన ఆఫ్తాబ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలా నార్కో టెస్ట్ ముగిసింది. రెండు గంటలపాటు జరిగిన నార్కో టెస్టులో తన ప్రియురాలిపై జరిగిన పాశవిక హత్యను వివరించాడు. ఫోరెన్సిక్ అధికారులు దీనిని ధృవీకరించనప్పటికీ, అఫ్తాబ్ హత్య, మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు అంగీకరించినట్లు వర్గాలు పేర్కొన్నాయి. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా రోహిణిలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో గురువారం నార్కో పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నార్కో పరీక్ష దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. ఎఫ్ఎస్ఎల్ అధికారులు, నిపుణుల సమక్షంలో జరిగిన పరీక్షలో అఫ్తాబ్‌ను పలు ప్రశ్నలు, సమాధానాలు అడిగారు.
Read Also: Raipur : మనీ లాండరింగ్ ఆరోపణలపై సీఎం డిప్యూటీ సెక్రటరీ అరెస్ట్
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అతడిని 50కి పైగా ప్రశ్నలు అడిగినట్లు, ఇందులో భాగంగా శ్రద్ధ హత్య, మృతదేహం ఆచూకీతో సహా పలు రహస్యాలను వెల్లడించే ప్రయత్నం చేశామని అధికారులు ప్రకటించారు. గాఢనిద్రలో ఉన్న అఫ్తాబ్‌ని పదే పదే చప్పుడుతో నిద్రలేపి ప్రశ్నలకు సమాధానం రాబట్టామన్నారు. మధ్యాహ్నం 12.00 గంటల ప్రాంతంలో నార్కో పరీక్ష పూర్తయింది. అనంతరం గంటపాటు అబ్జర్వేషన్ రూంలో ఉంచామన్నారు. ఆ తర్వాత మళ్లీ వైద్యం చేయించాక… అర్ధరాత్రి 1.00 గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరిగి తీహార్ జైలుకు తరలించారు.
Read Also: LAGOS : 11రోజులు అన్నం, నీళ్లు లేకుండా ఓడ వెనుక కూర్చుని..3,200 కి.మీ. ప్రయాణం
నార్కో టెస్ట్‌లో అఫ్తాబ్ ని ఏంప్రశ్నలడిగారు… ఏయే రహస్యాలు బయటపడ్డాయో వివరించేందుకు అధికారులు నిరాకరించారు. ఈ ప్రక్రియ చాలా గోప్యంగా ఉంచినట్లు చెప్పారు. నివేదిక తయారు చేసి కోర్టులో సమర్పించారు. దాని ఆధారంగానే కోర్టు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అతని పోస్ట్ నార్కో పరీక్ష కూడా జరుగుతుందని ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు. నార్కో పరీక్ష పరీక్షను నిర్ధారించడానికి ఈ పరీక్ష జరుగుతుంది. అఫ్తాబ్ సమాధానాలను విశ్లేషించిన తర్వాత, నివేదిక సీలు చేసిన కవరులో కోర్టుకు సమర్పించనున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!