NTV Telugu Site icon

Film Industry : రెమ్యునరేషన్స్ ఎఫెక్ట్.. జూన్ 1 నుంచి షూటింగ్స్ బంద్..

Film Industry

Film Industry

మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది! యాక్టర్ల పారితోషికాలు మామూలుగా లేవు. ఏకంగా సినిమా బడ్జెట్‌లో 60 శాతం రెమ్యునరేషన్స్ అందజేస్తున్నారు. ఇండస్ట్రీపరంగా నటీనటులు, టెక్నీషియన్ల పారితోషికాలు భారీగా పెరిగాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న యాక్టర్లు, డైరెక్టర్లు కూడా ఎక్కువ రెమ్యునరేషన్స్ డిమాండ్‌ చేస్తున్నారు. 2024లో విడుదలైన చిత్రాల్లో 176 చిత్రాలు వసూళ్లపరంగా నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే రూ. 101 కోట్లు నష్టం వాటిల్లింది. అంతే కాకుండా.. సినిమా పరిశ్రమ 30 శాతం పన్ను కడుతోంది. ఏ ఇతర ఇండస్ట్రీలపై ఇంత శాతం పన్నుల వేటు వేయడం లేదు! ఈ 30 శాతంలో జీఎస్‌టీ కాకుండా అదనంగా వినోదపు పన్ను కూడా మోపుతున్నారు. ఇదే కాదు.. 50 రోజుల్లోనే పూర్తి చేయడానికి వీలున్న సినిమాలు 150 రోజులు చేస్తున్నారట. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయి నష్టాలు వస్తున్నాయి.

READ MORE: RRB GroupD Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్‌డి జాబ్స్.. కొన్ని రోజులే ఛాన్స్.. అప్లై చేశారా?

ఈ పరిస్థితులు మాలీవుడ్‌కి కలిసి వచ్చేలా లేవు. నిర్మాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాగే కొనసాగితే చిత్ర పరిశ్రమ ప్రశ్నార్థంకంగా మారుతుంది. ఈ కారణాల వల్ల జూన్‌ 1 నుంచి సంపూర్ణంగా షూటింగ్స్, అలానే సినిమాలకు సంబంధించిన ఇతర కార్యకలాపాలను నిలిపివేయాలని, చివరికి సినిమాల ప్రదర్శనలను కూడా ఆపాలని కేరళ కేరళ చిత్ర నిర్మాతల మండలి, కేరళ చిత్ర పంపిణీదారుల సంఘం, కేరళ చలన చిత్ర కార్మికుల సమాఖ్య, కేరళ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయం తీసుకున్నాయి. నటీనటుల పారితోషికం తగ్గింపు, తక్కువ రోజుల్లో సినిమా పూర్తి చేయడం వంటి డిమాడ్లు లేవనెత్తుతున్నారు. పన్ను తగ్గింపు లేదా ఎత్తివేతను కోరుతూ మలయాళ చిత్రసీమకు చెందిన కీలక శాఖల అధ్యక్షులు త్వరలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని, ఇతర సంబంధిత మంత్రులను కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

READ MORE: Kunamneni Sambasiva Rao: స్థానిక సంస్థల ఎన్నికలపై కూనంనేని కీలక వ్యాఖ్యలు..