Site icon NTV Telugu

Brazil: ఫ్లైట్ నడిపిన 11 ఏళ్ల బాలుడు.. మందుకొట్టిన తండ్రి.. ఇద్దరు మృతి

11years Boy

11years Boy

బ్రెజిల్‌లో ఓ విమానం కుప్పకూలిన ఘటనలో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విమానం కూలిపోవడానికి కొన్ని నిమిషాల ముందు 11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడుపుతుండగా పక్కనే తండ్రి సీట్లో బీర్ తాగుతున్నట్లు కనిపిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విమానం కూలిపోయే ముందే ఆ వ్యక్తి విమానాన్ని తన కొడుకుకు ఇచ్చాడా లేక.. ఏం జరిగింది అనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు విచారణ చేస్తున్నారు.

Read Also: SSMB 29: ఒక్క అప్డేట్ ఇచ్చి చూడు జక్కన్న… బ్రహ్మాండం బద్దలవుతుంది

అయితే, జులై 29న గారాన్ మాయా అనే పరిశోధకుడు తన 11 ఏళ్ల కొడుకుతో ఫ్రాసిస్కో మాయాతో కలిసి ట్విన్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బేరాన్ 58 ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లాడు. ఆ తరువాత కొద్ది సేపటికే విమానం అడవిలో కూలిపోయినట్లు సమాచారం వచ్చింది ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. అయితే, ఆ తండ్రీకొడుకులు రాండోనియా నగరం నుంచి బయలుదేరి.. మధ్యలో విల్హేనా ఎయిర్‌పోర్టులో ఇంధనం నింపుకునేందుకు దిగారు.. ఆ తరువాత బాలుడిని క్యాంపో గ్రాండేలోని అతడి తల్లి దగ్గర దిపేందుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Read Also: Fire Robot: మంటలను ఆర్పేందుకు సూపర్ ఫైర్ రోబో..

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో గారాన్ తన కుమారుడికి ఫ్లైట్ ఎలా నడపాలో చెప్తున్నట్లు క్లీయర్ గా కనిపిస్తుంది. నిబంధనల ప్రకారం, కనీసం హైస్కూల్ చదువు పూర్తి చేసి 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే విమానాలు నడిపేందుకు అర్హులు.. ఆ వ్యక్తికి తన కుమారుడి భద్రతపై ఎంత శ్రద్ధ ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోందని అధికారులు కామెంట్స్ చేశారు. మరోవైపు, భర్త పిల్లలను కోల్పోయి.. దుఃఖాన్ని తట్టుకోలేకపోయిన గారాన్ భార్య, వారి అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే సూసైడ్ చేసుకుంది.

Exit mobile version