NTV Telugu Site icon

Mumbai Train Incident: మహిళల కంపార్టుమెంట్‌లో నగ్నంగా ప్రయాణించిన యువకుడు.. (వీడియో)

Mumbai

Mumbai

Mumbai Train Incident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌ నుంచి కళ్యాణ్‌ వెళ్ళే లోకల్‌ రైలు ఘట్‌కోపర్‌ స్టేషన్‌ వద్ద ఆగిన సమయంలో ఓ యువకుడు ఒంటిపై నూలుపోగు లేకుండా రైలులో ఎక్కాడు. అదికూడా నేరుగా మహిళల కంపార్టుమెంట్‌లో ప్రవేశించాడు. దీనితో రైల్లో ప్రయాణిస్తున్న మహిళల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలయింది. మహిళలు అందరూ అతడిని రైల్లో నుంచి బయటకు వెళ్లాలని అరిచారు. అయినా కానీ, అతడు వారి మాటలను పట్టించుకోలేదు. ఈ సందర్భంలో రైలు ఆపమని మహిళలు గట్టిగా అరిచారు. మహిళల అరుపులను విన్న పక్క బోగీలో ఉన్న టీసీ అక్కడ చేరుకుని అతడిని కిందకు దిగమని హెచ్చరించాడు. అయితే, సదరు నగ్న వ్యక్తి నిరాకరించడంతో, టీసీ అతడిని బలవంతంగా తర్వాత స్టేషన్‌లో బలవంతంగా రైలు నుండి కిందకు తోశాడు.

Also Read: Rs.5 Biryani Offer: రూ.5 బిర్యానీకి భారీ బందోబస్తు..! పోలీసుల తీరుపై విమర్శలు..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ ఘటనపై వివిధ రకాలుగా స్పందించారు. కొందరు నిందితుడి అసభ్యమైన తీరును ఘాటుగా వ్యతిరేకిస్తున్నారు. మరికొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు రైళ్లలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదేమోనని పలు అనుమానలు వ్యక్తం చేశారు. అయితే, సదరు వ్యక్తిని పోలీసులు విచారించినప్పుడు, అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని విచారణలో తేలింది. దాంతో, అతడికి బట్టలు అందించి, అతడిని స్టేషన్‌ బయటికి పంపించారు.

Show comments