Site icon NTV Telugu

Hate Speech: మతం పేరుతో ఎక్కడికి చేరుకున్నాం?.. ద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు

Supreme Court

Supreme Court

Hate Speech: రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలు చేయడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఇది భారత రాజ్యాంగంలోని విలువలకు విరుద్ధమని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. మతాలకు అతీతంగా.. ఈ తరహా ప్రసంగాలు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దేశంలో వర్గాలను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురిచేసే విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌ల ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ తరహా కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కేంద్రంతో పాటు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించింది.

Adar Poonawalla: గర్భాశయ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి భారత్‌లో అప్పుడే..

విద్వేష పూరిత ప్రసంగాలు ముఖ్యంగా ప్రజాస్వామిక, మత-తటస్థ దేశానికి భంగమని కోర్టు అభిప్రాయపడింది. ఎవరో ఫిర్యాదు చేస్తారని ఎదురుచూడకుండా నిందితులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాని యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాగం జాప్యం చేసినట్లయితే దానిని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది. దేశ లౌకిక విధాన పరిరక్షణకు విద్వేష పూరిత ప్రసంగాలు ఎవరు చేసినా మత ప్రసక్తి లేకుండా సుమోటో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షహీన్ అబ్దుల్లా అనే పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ‘ఇది 21వ శతాబ్దం. మతం పేరిట మనం ఎక్కడికి చేరుకున్నాం? లౌకిక దేశంలో ఈ పరిస్థితి దిగ్భ్రాంతికరం అంటూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Exit mobile version