NTV Telugu Site icon

Shocking Dating: నీ డేటింగ్ తగలెయ్య.. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి అవసరమా.. వైరల్ వీడియో..

Dating Viral

Dating Viral

ఒక అమ్మాయిని డేటింగ్‌కి తీసుకెళ్తున్నప్పుడు, రొమాంటిక్ లొకేషన్‌ను ఎంచుకుంటారు. వారిని మంచి రెస్టారెంట్ లేదా పార్కుకు తీసుకెళ్లడం పరిపాటి. ఎలాంటి రిస్క్ లేకుండా సురక్షితంగా డేటింగ్ జరగాలని కోరుకుంటారు. కానీ., ఓ మనిషి తన జీవితంతో పాటు తన ప్రేయసి జీవితంను కూడా రిస్క్ లో పెట్టాడు. వెరైటీ డేట్ ప్లాన్ కోసం వారిదహరి జీవితాలను పణంగా పెట్టాడు. అతను ఆమెను మరపురాని డేటింగ్ సాహసానికి తీసుకెళ్లాడు. ఈ వైరల్ వీడియో చూసిన తర్వాత ఎవరూ భయపడకుండా ఉండలేరు.

Also Read: Rapido: హైదరాబాద్‌ సహా నాలుగు నగరాల్లో ఓటేసిందుకు పోలింగ్‌ కేంద్రాలకు ‘ర్యాపిడో’ ఫ్రీ రైడ్‌..

ఈ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోలో, ఒక యువతి, యువకుడు లంచ్ టేబుల్‌ తో గాలిలో ప్రయాణించారు. రెండు కొండల మధ్య కేబుల్ వైరుకు వేలాడుతూ ధైర్యంగా అత్యంత సాహసోపేతంగా భోజనం తిన్నారు. ఈ వీడియో చూస్తే నిజంగా భయం వేస్తుంది. అందుకే కాబోలు ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 2.5 కోట్లకు పైగా ప్రజలు వీక్షంచగా.. లక్షల సంఖ్యలో ప్రజలు దీన్ని లైక్ చేసారు.

Also Read: RCB Fans: ఒక్క కప్ గెలవకపోయిన ఇంత క్రేజ్ ఏంటయ్యా.. డిగ్రీ పట్టా తీసుకుంటూ ఆర్సీబీ జెండా, జెర్సీతో పోజులు..

ఇక ఈ వీడియో చుసిన నెటిజన్స్ కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. అందులో కొందరు ‘ ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఇదే చివరి భోజనం అవుతుంది ‘ అని అనగా మరికొందరైతే.. ` అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Show comments