NTV Telugu Site icon

Patan Cheru : వామ్మో.. ఒక్క ఇంట్లో 120ఓట్లా.. ఎన్నికల అధికారులే షాక్

New Project (39)

New Project (39)

Patan Cheru : దేశంలో చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. ఈ సారి ఎన్నికల పోరు హోరాహోరీగా ఉండనుంది. పార్టీలన్నీ ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పదునైన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ అధికారులకు అన్ని స్థాయిల్లో శిక్షణ ఇచ్చే చర్యలు, ఓటరు జాబితా పర్యవేక్షణ వంటి అంశాలపై దృష్టి సారించి ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలతో ఎన్నికల కసరత్తు మొదలైంది.

Read Also: IT Layoffs: గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు… చేసింది చాల్లే పొమ్మన్నారు.. ఉద్యోగులకు ఐటీ కంపెనీ షాక్..

తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగుస్తుంది. దీంతో 2013 డిసెంబర్ నెలాఖరుకు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. దీనికి రెండు నెలల ముందే షెడ్యూల్‌ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో ముందుగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని అధికారులు భావించారు. అలాగే ఓటరు జాబితాపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో అత్యధికంగా బోగస్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పటాన్ చెరులో 2018 వరకు 181 పోలింగ్ బూత్ లు ఉండగా.. ఈ పోలింగ్ బూత్ లలో బోగస్ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. శుక్రవారం ఒకే ఇంట్లో 120 మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఒకే ఇంట్లో 120 ఓట్లు ఉండడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు. బోగస్ ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని పటాన్ చెరు తహసీల్దార్ పరమేష్ వెల్లడించారు. బోగస్ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల నాటికి పూర్తిస్థాయి ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Read Also: Spiritual : శుభకార్యాలు చేసే టైంలో తుమ్మితే ఏమవుతుందో మీకు తెలుసా..?