Site icon NTV Telugu

Rajasthan: విషాదం.. భర్త మృతితో షాక్‌కు గురై..భార్య, కొడుకు కూడా మృతి

Rajasthan

Rajasthan

రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మృతితో షాక్‌కు గురైన భార్య, కుమారుడు కూడా మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ముగ్గురి పోస్టుమార్టం నివేదికలు వచ్చిన తర్వాతే మొత్తం పరిస్థితి తేలనుందని పోలీసులు చెబుతున్నారు. అదే సమయంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

READ MORE: Godavari Floods: గోదావరికి శబరిపోటు.. ప్రమాద హెచ్చరికలు జారీ

అసలేం జరిగిందంటే.. షాహపురా జిల్లాలోని కోత్రి సబ్‌డివిజన్‌లోని బద్లియాస్‌ గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్‌ సత్యనారాయణ సోని శనివారం ఉదయం పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే.. భర్త మరణం తర్వాత షాక్ కు గురైన భార్య మమత, కుమారుడు అశుతోష్ ఆదివారం అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే వారిద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ.. తల్లి, కొడుకు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందిన వార్త ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆదివారం మధ్యాహ్నం తల్లీకొడుకుల అంత్యక్రియలు జరగడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి.

READ MORE: India-Pak: సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య..ఫెన్సింగ్ కట్ చేసిన పాక్ పౌరులు

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యన్‌నారాయణ సోనిని గత కొన్ని రోజులుగా వడ్డీ వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారు. ఈ కుటుంబంలో ముగ్గురు మృతికి గల కారణాలేమిటన్నది పోలీసుల విచారణలో తేలనుంది. బద్లియాస్ పోలీస్ స్టేషన్ మొత్తం కేసును సీరియస్‌గా విచారించడం ప్రారంభించింది. ముగ్గురి పోస్టుమార్టం నివేదిక తర్వాతే మొత్తం పరిస్థితి తేలనుందని బద్లియాస్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సిద్ధార్థ్ ప్రజాపత్ తెలిపారు.

Exit mobile version