NTV Telugu Site icon

YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీత, బీటెక్ రవికి చుక్కెదురు.. రూ.10వేల ఫైన్‌ విధింపు

Cuddapah Court

Cuddapah Court

YS Viveka Case: కడప కోర్టులో వైఎస్ షర్మిల, వైఎస్‌ సునీత, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి చుక్కెదురైంది.. అంతే కాదు పదివేల రూపాయల జరిమానా విధించింది కడప కోర్టు.. అయితే, ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించరాదని గతంలో కోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే కాగా.. కడప కోర్టు ఆర్డర్‌ను డిస్మిస్‌ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు సునీత.. అయితే, సునీత పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.. కడప కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.. ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టు.. ఇరువర్గాల వాదనలు వింది.. ఆ తర్వాత షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారన్న పేర్కొంది.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి మా రెడ్డి రంగారెడ్డికి అలియాస్ బీటెక్ రవికి రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు.. ఆ జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలన పేర్కొంది కడప కోర్టు.

Read Also: Priyanka Gandhi: అమేథీ, రాయ్‌బరేలీలో ప్రియాంక ప్రచారం.. ఖాతాలో వేసుకుంటారా?

కాగా, వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడొద్దని కడప కోర్టు గత నెలలో స్పష్టం చేసిన విషయం విదితమే.. ఈ మేరకు వైఎస్ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఆదేశాలను జారీ చేసింది.. నారా లోకేష్, పురందేశ్వరి కూడా వైఎస్‌ వివేకా హత్యపై ప్రస్తావించొద్దని ఆదేశించింది. అయితే, వైఎస్‌ వివేకా హత్య కేసును ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారంటూ.. వైసీపీ నేత సురేష్ బాబు కోర్టులో పిటిషన్ వేస్తూ.. వైఎస్‌ షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్ తో పాటు రవీంద్ర నాథ్ రెడ్డి పేరును కూడా చేర్చారు. దీనిపై విచారించిన కడప కోర్టు.. వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన విషయం విదితమే.