NTV Telugu Site icon

Shock for YSRCP: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్

Tdp

Tdp

Shock for YSRCP: పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేసి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ.అశోక్, ఎస్.కిషోర్, ఎస్.మురళీ, రెడ్డి కిషోర్ టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Read Also: Andhra Pradesh: వార్డెన్‌, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడి కీచక పర్వాలు.. విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన

Show comments