ప్రస్తుతం సౌత్ నుంచి నార్త్ వరకు బిజీగా ఉన్న శోభితా ధూళిపాళ్ల, ఒక పవర్‌ఫుల్ క్రైమ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తోంది. ఆమె మెయిన్ లీడ్‌లో నటించిన ‘చీకటిలో’ సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం జనవరి 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉండనుంది. కాగా ఈ సినిమాలో శోభిత ఒక పాడ్‌కాస్టర్‌గా కనిపిస్తూ, హైదరాబాద్‌లోని కొన్ని భయంకరమైన మిస్టరీలను ఛేదించబోతోంది. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా పోస్టర్ చూస్తుంటేనే చాలా గగుర్పొడిచేలా ఉంది.
Also Read : Vaa Vaathiy : ‘జన నాయగన్’ అవుట్ తో..కార్తీకి గోల్డెన్ ఛాన్స్?
‘చీకట్లు కమ్ముకునే ముందే సంధ్య వచ్చేస్తుంది.. సిద్ధంగా ఉండండి’ అంటూ వచ్చిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శోభిత ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ లోతైన నిజాలను ఎలా బయటపెట్టిందనేది అసలు కథ. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. సంక్రాంతి హడావిడి ముగిశాక, జనవరి చివర్లో ప్రైమ్ వీడియోలో ఈ ‘చీకటి’ రచ్చ మొదలవబోతోంది.