NTV Telugu Site icon

Sania Mirza: షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది!

Shoaib Malik Marriage

Shoaib Malik Marriage

Shoaib Malik Sisters on Sana Javed’s Wedding: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ వివాహం చేసుకున్నాడు. సనాతో ఎఫైర్ ఉండడం తట్టుకోలేని సానియా.. షోయబ్‌కు విడాకులు ఇచ్చిందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. విడాకులపై సానియా స్పందించకపోయినా.. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించాడు. ముస్లిం చట్టం ‘ఖులా’ ప్రకారం సానియా విడాకులు తీసుకుందని ఓ జాతీయ మీడియాకు చెప్పాడు. అయితే షోయబ్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయిందని అతడి సోదరీమణులు చెప్పినట్లు పాకిస్థాన్ డైలీ పేర్కొంది.

‘పాకిస్తాన్ నటి సనా జావేద్‌తో జరిగిన మూడో వివాహానికి షోయబ్ మాలిక్ కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. సనాను పెళ్లి చేసుకోవడం షోయబ్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకోవడంపై షోయబ్ సోదరీమణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. షోయబ్ వివాహేతర సంబంధాలతో సానియా విసిగిపోయింది’ అని పాకిస్థాన్ డెయిలీ ట్వీట్ చేసింది. షోయబ్ మూడో పెళ్లి పట్ల అతడి కుటుంబసభ్యులు ఆగ్రహంగా ఉన్నారని పాకిస్థాన్ డైలీ పేర్కొంది.

Also Read: Sania Mirza: ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్‌ అవుతాం! సానియా పోస్ట్‌ వైరల్‌

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్‌ మాలిక్‌ 2002లో ఆయేషా సిద్ధిఖీని పెళ్లి చేసుకున్నాడు. 2010లో ఆమెతో విడిపోయి.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అనంతరం షోయబ్‌, సానియా దుబాయ్‌లో స్థిరపపడ్డారు. 2018లో వీరికి ఇజాన్‌ మీర్జా మాలిక్‌ పుట్టాడు. 10 ఏళ్లు సాఫీగా సాగిన వీరి బంధానికి బీటలు వారింది. నటి సనా జావెద్‌తో షోయబ్‌ సన్నిహితంగా ఉండడంతో.. సానియా అతడిని పక్కనెట్టిందని 2-3 ఏళ్లుగా నెట్టింట వార్తలు వచ్చాయి. చివరకు సనాను షోయబ్‌ పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు.