Sania Mirza: ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్ అవుతాం! సానియా పోస్ట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sania Mirza Post Goes Viral after Sana Javed, Shoaib Malik Weddig: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడిపోయారంటూ గతకొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను చాలాసార్లు పరోక్షంగా ఖండిస్తూ వచ్చారు. అయితే చివరకు అదే నిజమైంది. సానియాతో వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకుంటూ.. మరో ఇన్నింగ్స్‌కు షోయబ్ తెరదీశాడు. పాకిస్థాన్ నటి సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్నాడు. షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనాకు రెండోది. షోయబ్ పెళ్లి నేపథ్యంలో పెళ్లి, విడాకులకు సంబంధించి ఇటీవలే సానియా ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
షోయబ్ మాలిక్ మూడో పెళ్లికి కొన్ని రోజుల ముందు సానియా మీర్జా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరలవుతోంది. జీవితంలో ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్ అవుతాం అని ఓ పాపులర్ కొటేషన్‌ని సానియా పోస్ట్ చేసింది. ‘పెళ్లి కఠినమైనదే, విడాకులు కఠినమైనవే.. ఇందులో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి. లావుగా ఉన్నా కష్టమే, అలాగే ఫిట్‌గా మారడమూ కష్టమైన పనే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి. అప్పు చేసినా కష్టమే.. అలానే ఆర్థిక క్రమశిక్షణ పాటించడమూ కష్టమే.. ఇందులో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి. మాట్లాడినా కష్టమే, మాట్లాడకపోయినా కష్టమే.. వీటిలో మీకు కష్టంగా అనిపించిన దాన్ని ఎంచుకోండి. జీవితంలో ముందుకు సాగడం సులభం కాదు..మనం వేసే ప్రతి అడుగూ కష్టమైనదే. మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఎంత కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటే.. అంతగా సక్సెస్ అవుతాం. అందుకే తెలివిగా మీ మార్గాన్ని ఎంచుకోండి’ అని సానియా పేర్కొంది.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
Also Read: IPL Title Sponsor: టాటా గ్రూప్‌కే మరోసారి ఐపీఎల్ టైటిల్ హక్కులు.. టోర్నీ చరిత్రలోనే అత్యధిక మొత్తం!
2002లో ఆయేషా సిద్ధిఖీని షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నాడు. 2010లో ఆయేషాతో విడిపోయిన షోయబ్.. అదే ఏడాది సానియా మీర్జాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత దుబాయ్‌లో స్థిరపడ్డ ఈ స్పోర్ట్స్ కపుల్‌కు 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ పుట్టాడు. గత రెండేళ్లుగా షోయబ్, సానియా విడిపోయారంటూ కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ నటి సనా జావెద్‌తో సన్నిహితంగా ఉండడంతోనే సానియా అతడిని పక్కనెట్టిందని వార్తలు కూడా వచ్చాయి. చివరకు అవే వార్తలు నిజమయ్యాయి. సనా జావెద్‌ను పెళ్లి చేసుకున్న షోయబ్ అందరికీ షాక్ ఇచ్చాడు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!