NTV Telugu Site icon

Shoaib Malik: పాక్ కన్నా ఆఫ్ఘాన్ బెటర్.. సొంత జట్టుపై విమర్శల వెల్లువ

Malik

Malik

Shoaib Malik: ఈ ప్రపంచకప్ లో హాట్ ఫెవరేట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శన చూపింది. ఈ టోర్నీ్ల్లో ప్రారంభంలో అదరగొట్టినప్పటికీ, తర్వాత వరుసగా పరాజయం పాలైంది. అయితే సెమీస్ రేసులో ఉంటుందనుకున్న తమ ఆశలపై న్యూజిలాండ్ జట్టు నీళ్లు జల్లింది. అయితే పాకిస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 287 పరుగుల తేడాతో విక్టరీ సాధిస్తే సెమీస్ కు చేరే అవకాశం ఉంటుంది. కానీ ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ ఓడటంతో సెమీస్ ఆశలు ఇక లేనట్లైంది. మరోవైపు పాకిస్తాన్ జట్టుపై తమ దేశానికి చెందిన కొందరు మాజీ ఆటగాళ్లు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: Viral Video: బైక్‌పై ఎద్దును కూర్చోపెట్టి రైడింగ్.. నువ్వు గ్రేట్ రా బుజ్జా..!

తాజాగా పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ జట్టు కంటే అఫ్గానిస్తాన్‌ చాలా బెటర్‌ అని అభిప్రాయపడ్డాడు. “వన్డే ప్రపంచకప్‌-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్‌ మెరుగైన క్రికెట్‌ ఆడింది. అఫ్గాన్స్‌ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు” అని కార్యక్రమంలో మాలిక్‌ చెప్పాడు. మరో పాక్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ మాట్లాడుతూ..”అఫ్గానిస్తాన్‌ జట్టు మాకంటే బలంగా కన్పించింది. మా బాయ్స్‌ నిరంతరం క్రికెట్ ఆడటం వల్ల బాగా అలసిపోయారు. నిజంగా అఫ్గానిస్తాన్‌ మాత్రం అద్బుతమైన క్రికెట్‌ ఆడిందని కామెంట్స్ చేశాడు.

Read Also: World Cup 2023: స్టార్ స్పోర్ట్స్ పై రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహం